జగపతిబాబు వల్ల భారీగా లక్షలు నష్టపోయాను

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు ఏర్పాటు చేసుకున్న వేణు తొట్టెంపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన వేణు తన యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. అయితే చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వేణు ఇటీవల రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాలో వేణు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో నేను తొట్టెంపూడి మళ్లీ ఫామ్ లోకి వస్తాడని అందరూ భావించారు. అయితే సినిమా ప్లాప్ అవ్వటంతో అందరి అంచనాలు తారుమారయ్యాయి.

ఈ సినిమా విడుదల కాకముందు వేణు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు తొట్టెంపూడి సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా వెల్లడించాడు. ఈ క్రమంలో వేణు మాట్లాడుతూ. తాను కాకినాడలో పుట్టినప్పటికీ చెన్నైలోనే పెరిగానని చెప్పుకొచ్చాడు సినిమాలంటే తనకు చిన్నప్పటి నుంచి పిచ్చని నాన్నకు తెలియకుండా ఒకసారి సినిమా చూసినందుకు బెల్ట్ తెగిపోయేలా కొట్టాడని చెప్పుకొచ్చాడు. నాకు సినిమా పిచ్చి తప్ప ఇతర ఏ చెడు అలవాట్లు లేవని వేణు వెల్లడించాడు.

ఇక ఇంటర్వ్యూలో వేణు ఈరోజు జగపతిబాబు గురించి సంచలన కామెంట్స్ చేశాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్న జగపతిబాబు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి విలన్ పాత్రలలో నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అయితే గతంలో వేణు జగపతిబాబు కలిసి హనుమాన్ జంక్షన్, ఖుషీఖుషీగా అనే సినిమాలలో నటించాడు. ఈ సినిమాలు రెండు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. గతంలో జగపతిబాబు తన హామీతో ఇతరులకు నా నుండి 14 లక్షల రూపాయలు అప్పుగా ఇప్పించాడు. అయితే అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించకుండా నన్ను మోసం చేశాడని వేణు వెల్లడించాడు. జగపతి బాబును నమ్మి 14 లక్షలు అప్పుగా ఇచ్చి అతని వల్ల నేను చాలా నష్టపోయామని వేణు సంచలన వ్యాఖ్యలు చేశారు.