రామ్ చరణ్ ఎవరో నాకు తెలీదు.. ?

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం ఈ ఇండస్ట్రీలో అందానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే హీరో, హీరోయిన్లు అందంగా , ఫిట్ గా ఉండక తప్పదు. అందువల్ల హీరో హీరోయిన్లు తమ అందాన్ని, ఫిజిక్ ని కాపాడుకోవడం కోసం ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యుల కన్నా జిమ్ ట్రైనర్లతోనే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలంటే యవ్వనంగా కనిపించడానికి వర్కౌట్స్ చేయటం చాలా అవసరం.

మన టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు కూడా ఎక్కువ సమయం వర్కౌట్లు చేయటానికి సమయం కేటాయిస్తారు. టాలివుడ్ హీరోలకు ఫిట్నెస్ ట్రైనర్ గా గుర్తింపు పొందిన కులదీప్ సేతి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ నుంచి విజయ్ దేవరకొండ వరకు ఇలా స్టార్ హీరోలకు కులదీప్ ఒక్కడే ట్రైనర్ గా కొనసాగుతున్నాడు. అంతే కాకుండా రష్మిక వంటి హీరోయిన్లు కూడా కులదీప్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. ఇటీవల టైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ ట్రాన్స్ఫర్మేషన్ కి కులదీప్ కారణం.

ఇలా సెలబ్రెటీ ట్రైనర్ గా గుర్తింపు పొందిన కులదీప్ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదట రామ్ చరణ్ ని ట్రైన్ చేసినప్పుడు అతడు ఎవరో తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ ను మొదటిసారి జిమ్ లో కలిసినప్పుడు అందరిలానే తనకి కూడా ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. కానీ ఒక రోజు నా ఫ్రెండ్ అతను మెగాస్టార్ కొడుకు అని చెప్పగానే షాక్ అయ్యాను. ఆ తర్వాత చరణ్ దగ్గరకు వెళ్లి.. ఏంటి భయ్యా మీరు చిరంజీవి గారి కొడుకు అని ఎందుకు చెప్పలేదు అని అడిగితే.. ఏం చెప్పాలి అని చిరునవ్వుతో సమధానం చెప్పాడు. రామ్ చరణ్ లో ఎంత ఎదిగిన ఒదిగి ఉండే లక్షణం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.