ఒక్క రాత్రిలో స్టార్ హీరోయిన్ కాలేదు… ఎన్నో త్యాగాలు చేశాను..?

ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన మలయాళీ బ్యూటీ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గుర్తింపు పొందింది. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న రష్మిక తెలుగులో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఈమె నటించిన అన్ని సినిమాలు మినిమం హిట్ అవటంతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది. భీష్మ ,సరిలేరు నీకెవ్వరు, వంటి సినిమాలలో నితిన్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన ఆడి పాడిన ఈ అమ్మడు ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది.

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా ఫేమస్ అయ్యింది. అయితే రష్మిక నటించిన అన్ని సినిమాలు దాదాపుగా హిట్ అవటంతో బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొంతకాలానికి స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. దీంతో కొందరు హీరోయిన్లు రష్మిక పట్ల అసూయ వ్యక్తం చేస్తున్నారు. రష్మిక అదృష్టం బాగుంది కాబట్టి ఇలాంటి మంచి ఆఫర్లు వస్తున్నాయని ఆమె టాలెంట్ కన్నా అదృష్టాన్ని హైలైట్ చేస్తున్నారు.

ఇటీవల ఈ విషయంపై స్పందించిన రష్మిక మాట్లాడుతూ…’ హీరోయిన్ గా గుర్తింపు పొందటానికి తాను పడిన కష్టాల గురించి వెల్లడించింది. ఈ క్రమంలో రష్మిక మాట్లాడుతూ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి రాత్రికి రాత్రి స్టార్ అయిపోలేదు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఏడేళ్లు కష్టపడ్డాను. అందరూ అంటున్నట్లు నేను అదృష్టాన్ని వెంటపెట్టుకొని తిరగలేదు. ఏడేళ్లుగా ఎన్నో బాధలను దిగమింగుకొని ఎన్నో త్యాగాలు చేస్తే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను. అందరూ అంటున్నట్లు ఒక నైట్ లో నేను హీరోయిన్ అయిపోలేదు. హీరోయిన్ అవ్వటానికి ఎంతో ఓర్పు, పట్టుదల, సహనం ఉండాలి. హీరోయిన్ అవ్వటానికి ఒక్క రాత్రి సరిపోదు ‘ అంటూ చెప్పుకొచ్చింది.