వైరల్ : హార్ట్ అయ్యిన థమన్..బోయపాటికి కౌంటర్ రిప్లై..!

thaman18052022_c

రీసెంట్ గా టాలీవుడ్ లో రిలీజ్ అయ్యిన చిత్రం “స్కంద” విషయంలో కొంచెం రసవత్తర వాతావరణం కనిపిస్తుంది అని చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు బోయపాటి శ్రీను ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వూస్ లో తన గత చిత్రం అఖండ విషయంలో ఆ సినిమా సంగీతం విషయంలో కూడా పలు సంచలన కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.

కాగా ఆ చిత్రానికి సంగీతం అలా లేకపోయినా కూడా హిట్ అయిపోతుంది. అంత దమ్ము ఆ సినిమాలో సీన్స్ లో ఉందని థమన్ వర్క్ ని తగ్గించి మాట్లాడ్డం నిజంగా చాలా మందికి నచ్చలేదు. ఇక ఇదే అనుకుంటే నెక్స్ట్ స్కంద విషయంలో మరిన్ని సంచలన కామెంట్స్ బోయపాటి చేశారు.

స్కంద కి థమన్ మ్యూజిక్ బాగోలేదు అని చాలా కామెంట్స్ నా వరకు వచ్చాయి అందుకే థమన్ తో రిలీజ్ అయ్యాక ఇంకా మాట్లాడలేదు అని షాకింగ్ అంశాలు బోయపాటి చెప్పడం వైరల్ గా మారింది. అయితే అసలు ఇది థమన్ వరకు వెళ్లిందా లేదా అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఈ అంశంపై థమన్ హర్ట్ అయ్యాడనే కన్ఫర్మ్ అయ్యింది. దీనితో బోయపాటికి కౌంటర్ అన్నట్టుగా మెన్షన్ చెయ్యలేదు కానీ “ఐ డోంట్ కేర్”(నేను పట్టించుకోను) అంటూ కౌంటర్ వేసాడు. అయితే ఇది తన లేటెస్ట్ చిత్రం భగవంత్ కేసరి లో డైలాగ్ అయినప్పటికీ బోయపాటికి తాను ఇచ్చిన కౌంటర్ ఇదే అని చాలా మంది అంటున్నారు.

ఏది ఏమైనప్పటికీ మాత్రం బోయపాటి మాత్రం థమన్ విషయంలో చేసింది అయితే కరెక్ట్ కాదనే చెప్పాలి. మరి వీటితో అయితే మళ్ళీ ఈ కాంబినేషన్ కలుస్తుందో లేదో చూడాలి.
https://x.com/MusicThaman/status/1710894502683328928?s=20