మెగాస్టార్ చిరంజీవి – శంకర్ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ ..?

మెగాస్టార్ కెరీర్ లో 150 సినిమాలని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే కొన్ని సంవత్సరాలుగా అనుకుంటున్న క్రేజీ కాంబినేషన్ మాత్రం సెట్ కావడం లేదని అంటున్నారు. అదే మెగాస్టార్ చిరంజీవి – శంకర్ ల కాంబినేషన్. రజనీకాంత్ రోబో సినిమా ఫంక్షన్ లో కూడా చిరంజీవి కి ప్రత్యేకంగా శంకర్ తో ఒక సినిమా చేయమని. కాని ఎప్పటికప్పుడు అనుకుంటున్న ఈ కాంబినేషన్ వెనక్కి వెళుతూనే ఉంది.

Movie Reviews|Gossips|Mp3 Songs Free Download: Robo Audio Release In  Hyderabad by Chiranjeevi| Telugu Robot(Rajinikanth)

అయితే మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి శంకర్ తో సినిమా చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. చాలా మంది మొన్న మొన్నటి వరకు అదే ఫిక్సైయ్యారు. ఈ ఇద్దరు కలిసి భారీ స్థాయిలో పాన్ ఇండియన్ సినిమా చేస్తారని చెప్పుకున్నారు. అయితే ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్ సెట్ అవడానికి మరో రెండేళ్ళు పట్టే అవకాశం ఉందంటున్నారు.

Chiranjeevi's Acharya Story Stolen? | Gulte - Latest Andhra Pradesh,  Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photos

ప్రస్తుతం మెగాస్టార్ 152 వ సినిమాగా ఆచార్య ..153 చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా .. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. అలాగే యంగ్ డైరెక్టర్ బాబి తో కుడా ప్రాజెక్ట్ చేసేందుకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నారు. ఇక శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో ఇండియన్ 2 ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమా అయ్యాక యాక్షన్ కింగ్ అర్జున్ తో జెంటిల్ మాన్ 2 ని తెరకెక్కిస్తాడని సమాచారం. ఈ రకంగా చూస్తే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగాస్టార్ – శంకర్ కాంబోలో సినిమా ఇప్పట్లో రావడం అసాధ్యం అని తెలుస్తుంది.