“ఆనిమల్” తో దిల్ రాజుకి కాసుల పంట..!

ఈ ఏడాది బాలీవుడ్ సినిమా అందించిన పలు బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మరో యంగ్ బ్యూటీ త్రిప్తి దిమిరి నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించాడు. మరి ఈ సినిమాకి తెలుగులో కూడా భారీ హైప్ నెలకొనగా..

రణబీర్ కపూర్ ఈ చిత్రంతో భారీ వసూళ్లు హిందీ సహా తెలుగులో కూడా ఓపెన్ అయ్యాయి. దీనితో బాలీవుడ్ నుంచి తెలుగులో హైయెస్ట్ గ్రాస్ అందుకున్న చిత్రాలలో ఒకటిగా అనిమల్ నిలిచింది. కాగా తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు 15 కోట్లు పెట్టి కొనుగోలు చేసి రిలీజ్ చేయగా ఈ చిత్రం తెలుగులో డబుల్ ప్రాఫిట్స్ అందుకొని అదరగొట్టినట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ చిత్రం రిలీజ్ ఒక వారం కంప్లీట్ చేసుకోగా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం 50 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోగా 25 కోట్లకి పైగా షేర్ ని అందుకుంది. దీనితో దిల్ రాజుకి 10 కోట్లకి పైగా లాభాలు వచ్చి ఈ కౌంట్ ఇప్పుడు మరింత పెరుగుతూ వెళ్తుంది అని చెప్పాలి.

ఇక ఈ వీకెండ్ వసూళ్లు కూడా మరింత పెరుగుతూ వెళ్తున్నాయి. దీనితో ఈ అదనపు వసూళ్లుతో తెలుగు స్టేట్స్ లో మాత్రం లాంగ్ రన్ వరకు దిల్ రాజుకి కాసుల పంటే అని చెప్పొచ్చు. మరి చూడాలి లాస్ట్ వరకు ఈ సినిమా ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో అనేది. బహుశా బాలీవుడ్ సినిమాల్లో అయితే తెలుగు స్టేట్స్ లో హైయెస్ట్ గ్రాసర్ గా ఇది నిలవొచ్చు.