ఇన్సైడ్ టాక్ : తమిళ్ లో నానికి వరుస భారీ ఆఫర్స్.?

టాలీవుడ్ సినిమా దగ్గర తనదైన సహజ నటనతో మంచి క్రేజ్ అండ్ స్టార్డం తెచ్చుకున్న సోలో హీరో నాచురల్ స్టార్ నాని. మరి మెగాస్టార్, రవితేజ లాంటి స్టార్స్ అనంతరం స్వయం కృషితో సినిమాలో ఎదిగి మార్కెట్ తెచ్చుకున్న నాని ఇప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు అయితే చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉండగా ఈ లిస్ట్ లో అయితే నాని కి ఇప్పుడు వరుసగా పలు తమిళ ఆఫర్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. కాగా తమిళ్ లో అయితే ఇది వరకే దర్శకుడు సిబి చక్రవర్తి నాని కోసం ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ప్లాన్ చేసాడని తెలుస్తుంది. అయితే దీని తర్వాత మరో క్రేజీ ఆఫర్ నాని దగ్గరకి వచ్చినట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి ఈ సినిమా కూడా మామూలు ప్రాజెక్ట్ కాదు ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలోనే నాని ఓ కీలక పాత్రలో నటిస్తాడని ఇప్పుడు తెలుస్తుంది. కాగా ఈ చిత్రాన్ని సూర్య తో సెన్సేషనల్ హిట్ తీసిన దర్శకుడు జ్ఞ్యానవెల్ అయితే తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం నాని అవసరం పడింది అట.

దీనితో ఈ పాత్రలో నాని నటించే ఛాన్స్ ఉందని ఇక మరో పక్క సిబి చక్రవర్తి డిజైన్ చేస్తున్న కథ నాని తో చర్చలు ఫైనల్ స్టేజి కి కూడా వస్తున్నాయి అని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో రానున్న రోజుల్లో నాని కోలీవుడ్ లో మంచిబిజీ కానున్నాడు అని చెప్పాలి. ఇక ఇపుడు అయితే నాని హాయ్ నాన్న అనే చిత్రంలో నటిస్తుండగా ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కాబోతుంది.