బాక్సాఫీస్ : డే 2 కే భారీగా పడిపోయిన “గుంటూరు కారం” వసూళ్లు.!

చాలా కాలం తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర ఒక బిగ్ స్టార్ హీరో సినిమా ఫైనల్ గా బాక్సాఫీస్ దగ్గరకి అందులోని సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం “గుంటూరు కారం” కూడా ఒకటి. కాగా ఈ చిత్రం ఎన్నో అంచనాలు మీద వచ్చినప్పటికీ మొదటి రోజే టాక్ తేలిపోవడంతో సినిమాకి బాగా దెబ్బ పడింది.

అయినా కూడా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 96 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా మేకర్స్ తెలిపారు. కానీ సినిమాపై బ్యాడ్ టాక్ బాగా స్ప్రెడ్ అవ్వడం వల్లో ఏమో కానీ మొదటి రోజు అంత వసూళ్లు అందుకున్న ఈ చిత్రం నెక్స్ట్ డే అందులో సగం కూడా వసూళ్లు అందుకోకపోవడం షాకింగ్ అని చెప్పాలి.

కాగా రెండో రోజు కేవలం 30 కోట్ల మేర గ్రాస్ ని మాత్రమే అందుకోవడంతో ఈ చిత్రం ఎంత దారుణంగా పడిపోయింది అని చెప్పాలి. దీనితో ఈ చిత్రం పై వచ్చిన టాక్ నిజమే అని చెప్పక తప్పదు. అయినా కూడా నిర్మాతలు మాత్రం సినిమా ఇంకా పాజిటివ్ గానే ఉందని వసూళ్లు పెరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు.

కానీ బుకింగ్స్ ఏమో డల్ గానే ఉన్నాయి మరి చూడాలి లాస్ట్ గా ఎక్కడ ఈ వసూళ్లు ఆగుతాయో చూడాలి. కాగా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా కనిపించారు. అలాగే రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ మరియు జగపతిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.