‘భోళా శంకర్’ 150 కోట్లు.!

ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన ప్రాజెక్ట్ ‘ఆచార్య’ ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఈ ఇంపాక్ట్‌తో చిరంజీవి మార్కెట్ పడిపోయిందన్న వార్తలు వినిపించాయ్. ఏకంగా 50 కోట్లకు దిగువే చిరంజీవి మార్కెట్ పడిపోయిందంటూ ప్రచారం జరిగింది.

అయితే, ‘గాడ్ ఫాదర్’తో మళ్లీ మెగాస్టార్ చిరంజీవి మార్కెట్ స్టేబుల్ అయ్యింది. ‘వాల్తేర్ వీరయ్య’తో నెక్స్‌ట్ లెవల్ అందుకుంది. చీప్ కామెడీ అని మొదట్లో ఎగతాళి చేసినా ‘వాల్తేర్ వీరయ్య’ను జనం ఎగబడి చూశారు.

అందుకే, చిరంజీవి నుంచి తదుపరి రాబోయే చిత్రం ‘భోళా శంకర్‌’పై భారీగా అంచనాలు మొదలయ్యాయ్. ఈ సినిమాకి 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఈ సినిమా రైట్స్ కోసం ఎగబడుతున్నారట. తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’కు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది.

మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మర్ కానుకగా మేలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, మెగాస్టార్‌కి చెల్లెలి పాత్రలో కనిపించనుంది.