పాపకి క్రేజ్ మామూలుగా లేదు.!

ఓ డిజాస్టర్ మూవీతో తెరంగేట్రం చేసింది అందాల భామ నేహాశెట్టి. అదే ‘మెహబూబా’. పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుని అడ్రస్ గల్లంతైపోయేలా చేసింది.

అయితే, ‘డీజె టిల్లు’ రూపంలో నేహా శెట్టికి అదృష్టం వరించింది. రీసెంట్‌గా ‘బెదురులంక’ సూపర్ హిట్‌తో నేహా శెట్టి గోల్డెన్ లెగ్ అయిపోయింది.

ఎప్పటి నుంచో సరైన హిట్టు లేక సతమతమవుతున్న కార్తికేయకు ‘బెదురులంక’ సూపర్ హిట్ చాలా కలిసొచ్చింది. దీంతో, నేహా శెట్టిపైనా గురి కుదిరింది మేకర్లకు.

ప్రస్తుతం కిరణ్ అబ్బవరంతో నేహా శెట్టి ఓ సినిమాలో నటిస్తోంది. అదే ‘రూల్స్ రంజన్’. ఈ సినిమా విజయంపై కిరణ్ అబ్బవరం చాలా ఆశలు పెట్టుకున్నాడు.

నిజానికి కిరణ్ అబ్బవరానికి స్టార్ డమ్ వచ్చినట్లే వచ్చి పోయింది. ఇప్పుడు ‘రూల్స్ రంజన్’ సినిమా హిట్ అయితే, మరోసారి ఈ కుర్ర హీరో ట్రాక్ ఎక్కే అవకాశాలున్నాయ్. ఈ నేపథ్యంలోనే నేహా శెట్టి గోల్డెన్ లెగ్గు తనకీ కలిసి రావాలని ఆశిస్తున్నాడు.

సెప్టెంబర్ 28న ‘రూల్స్ రంజన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లకు సంబంధించి నేహా శెట్టిని బాగా వాడేయాలని స్కెచ్ వేస్తున్నారట. ఆ దిశగా ఆల్రెడీ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనీ తెలుస్తోంది. చూడాలి మరి, నేహా శెట్టి లక్కు కిరణ్ అబ్బవరానికి ఎంత మేర కలిసొస్తుందో.!