“ఖుషి” బిజినెస్..అంతమొత్తం కష్టమే అంటున్నారా?

ఇపుడు టాలీవుడ్ సినిమా నుంచి రానున్న మరో నోటెడ్ రిలీజ్ ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అలాగే సమంత హీరోయిన్ గా నటించిన చిత్రం “ఖుషి” అని చెప్పాలి. దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అయితే ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుండగా..

ఈ చిత్రం ఇప్పుడు భారీ ప్రమోషన్స్ ని చేసుకుంటుంది. అయితే ఈ సినిమా విషయంలో ఇది వరకే మంచి హైప్ ఉండేది. ఒకో పాత సూపర్ హిట్ కావడం ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆసక్తిగా అనిపించడంతో ఏదో కొత్త లవ్ స్టోరీ తీసుకొస్తున్నట్టుగా అనిపించింది.

కానీ ఈ చిత్రం ట్రైలర్ చూసాక అయితే చాలామందిలో ఆసక్తి తగ్గిపోయింది. మరి అయినా కూడా ఈ సినిమా భారీ బిజినెస్ చేసినట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి సినీ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఈ చిత్రం ఏకంగా 60 కోట్లకి పైగానే బిజినెస్ చేసినట్టుగా రూమర్స్ ఉన్నాయి.

ఇపుడు ఉన్న హైప్ లో అయితే 60 కోట్ల షేర్ అంటే చాలా కష్టమే అని చెప్పాలి. ట్రైలర్ తర్వాత ఓపెనింగ్స్ కూడా అనుకున్న రేంజ్ లో వచ్చే ఛాన్స్ ని సినిమా కోల్పోయింది. దీనితో 100 కోట్లకి పైగా గ్రాస్ ని మెయిన్ గా 60 కోట్ల షేర్ ని ఈ చిత్రం అందుకుంటే అది అద్భుతమనే చెప్పాలి. మరి ఈ స్టార్ కాస్ట్ సినిమా ఎంతవరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. కాగా ఈ చిత్రానికి హీశం అబ్దుల్ వాహద్ సంగీతం అందించగా మైత్రి మేకర్స్ నిర్మాణం వహించారు.