ఫుల్ మూన్ విూడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1 గా రూపొందిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించారు. జయ శంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీశ్యామ్ గజేంద్ర నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచనాలు పెంచిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఈనెల 24న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ మీడియాతో ముచ్చటించారు.
సీనియర్ నటి ఆమని మా అత్త అవటంతో చిన్నప్పుడు నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేదని, చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కూడా నటించానని, ‘అల్లంత దూరాన’ సినిమా తర్వాత హీరోయిన్ గా తెలుగులో నాకు ఇది రెండో చిత్రమని ఇందులో నేను సిరి అనే ఇంపార్టెంట్ పాత్రలో నటించానని తెలిపింది. సంజయ్ గారు కథ చెప్పినప్పుడు ఎక్సైటింగ్ గా అనిపించిందని, ఇది ఒక కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్, కామెడీతో పాటు కంటెంట్ కూడా ఉంది. ప్రేక్షకులు కచ్చితంగా ఎంటర్టైన్ అవుతారని నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.
క్రికెట్ లో ధోనీ లాస్ట్ లో వచ్చి ఎలా సిక్స్ లు కొడతారో అలా ఈ సినిమాలో నా పాత్ర ఉంటుందని డైరెక్టర్ అంటుంటారని, సినిమా క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇస్తానని, సీరియస్ క్యారెక్టర్ అయినా సిచువేషన్ మాత్రం చాలా కామెడీగా ఉంటుంది. నా రియల్ లైఫ్ కి రిలేటబుల్ గా ఈ పాత్ర ఉంటుందని తెలిపింది. అమాయకులైన తండ్రి కొడుకులు ఈజీ మనీ కోసం ఎలాంటి పనులు చేస్తారనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ కాగా ఈ పాయింట్ నే దర్శకుడు చాలా ఫన్నీగా చూపించారని. ఇందులో బిట్ కాయిన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలిపింది.
సన్నీకి టెలివిజన్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బిగ్ బాస్ లో ప్రేక్షకులు తనని ఎలా చూశారో సెట్ లోనూ ఆయన అలానే ఉంటారని, సౌండ్ పార్టీ టైటిల్ కి కరెక్ట్ ఎగ్జాంపుల్ గా నటించారని, సెట్ లో చాలా సపోర్ట్ చేశారని తెలిపింది. ఇందులో సిచువేషన్ కి తగ్గట్టుగా రెండు పాటలు మాత్రమే ఉంటాయని, డైరెక్టర్ సంజయ్ రైటింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుందన్నారు. జయశంకర్ ప్రజెంటర్ గా ఉండడం ఈ సినిమాకు ప్లస్ అయిందని, నిర్మాతలు రవి, మహేంద్ర గజేంద్రలు చాలా సపోర్ట్ చేశారని పేర్కొంది. తెలుగులో నాకు నచ్చిన హీరోయిన్ సాయి పల్లవి. ఆమె చేసే రోల్స్ లాంటివి చేయాలని ఉంటుంది. హీరోల విషయంలో నాని అంటే నాకిష్టం’’.