బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌రోషన్, స్టార్ హీరోయిన్ సబా ఆజాద్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. హృతిక్ పరస్పర అంగీకారంతో 2014లో సుసానే ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న అనంతరం బాలీవుడ్ నటి సబా ఆజాద్‌తో పరిచయం ఏర్పడిరది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక వీరు గత కొంతకాలంగా కలిసే వుంటున్నారు. బాలీవుడ్‌లో జరిగిన పలు పార్టీలు, డిన్నర్ డేట్స్‌కు వీరిద్దరూ కలిసి హాజరవుతున్నారు. ఇక త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. బుధవారం సబా ఆజాద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రియురాలితో కలిసున్న ఫొటోను హృతిక్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ .. సబా ఆజాద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. మనం అంతా ఒక ప్రదేశం కోసం వెతుక్కుంటాము, ఎక్కడైతే మనం ఆప్యాయత, స్ఫూర్తి, ఇంకా సురక్షితంగా అనిపించే తోడు ఉంటే చాలు అని. కేవలం మనం కలిసి ‘‘జీవితం మన వైపు విసిరే సాహసాలను ఎదురుకోవడనికి సిద్ధం’’ అని చెప్పగలిగే ప్రదేశం. అదే మన ఇల్లు. అక్కడే మనకు సాహసాలు మొదలు అవుతాయి. రోజు చేసే పనులు కూడా అద్భుతంగా అనిపిస్తాయి. ఇది నేను నీ నుండి నేర్చుకున్నాను సబా. నాతో ఉన్నందుకు కృతజ్ఞతలు. ఇంకా సాహసాలు చేద్దాం. హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ హృతిక్ ఇన్‌స్టాలో రాసుకోచ్చాడు.