లవర్ చెప్పులు మోసిన స్టార్ హీరో

బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ అంటే ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడు. అతనిలాంటి వ్యక్తి భర్తగా రావాలని కలలు కంటూ ఉంటారు. హృతిక్ రోషన్ తో కనీసం ఫోటో దిగే అవకాశం వచ్చిన కూడా ఉప్పొంగిపోతారు. అలాంటి లేడీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో హృతిక్ రోషన్.

అయితే తాజాగా హృతిక్ రోషన్ కి సంబందించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి కారణం అందులో హృతిక్ రోషన్ తన ప్రియురాలు సబా ఆజాద్ చెప్పులు పట్టుకొని ఉండటమే. భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాత కొంతకాలానికి గాయకురాలు సబా ఆజాద్ తో హృతిక్ రోషన్ పరిచయం కావడం. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో ఇద్దరు లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు.

ముంబైలో ఖరీదైన ప్రాంతంలో 100 కోట్ల రూపాయిల విల్లా ఇద్దరు కొనుగోలు చేసి అందులో ఉంటున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే వీరిద్దరూ తాజాగా నీతూ అంబానీ కల్చలర్ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చారు. బాలీవుడ్ సెలబ్రిటీ ప్రముఖులు అందరూ కూడా ఈ సెంటర్ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు.

ఇందులో హృతిక్ రోషన్ ప్రియురాలు సబాతో కలిసి పార్టిసిపేట్ చేశారు. అక్కడ సబా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అగర్వాల్ తో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలని అమిత్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటోలో వారి వెనుక హృతిక్ రోషన్ చెప్పులు పట్టుకొని ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు. దీంతో ఆ ఫోటో కాస్తా వైరల్ గా మారింది.

ఇక ఫోటో చూసిన వారిలో ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. సభా మీద హృతిక్ రోషన్ కి ఉన్న ప్రేమ అందులో కనిపిస్తుంది అని కొందరు కామెంట్స్ చేశారు. అలాగే హృతిక్ రోషన్ సింప్లిసిటీకి ఎగ్జాంపుల్ గా ఇది ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంత మంది లేడీ అభిమానులు మాత్రం హృతిక్ రోషన్ అలా చెప్పులు మోయడం తట్టుకోలేకపోతున్నారు.