రామ్ చరణ్‌కి సల్మాన్ ఖాన్ ఎంతిచ్చాడబ్బా.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ బాలీవుడ్ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించారు. అదే, ‘కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్’లో గెస్ట్ అప్పీయరెన్స్.. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ పాటలో మాస్ స్టెప్పులు ఇరగదీస్తూ కనిపించారు.

లుంగీలో రామ్ చరణ్ ఎంట్రీ అదిరిపోయిందంతే. ఇదే పాటలో విక్టరీ వెంకటేష్ కూడా వున్నారు. సల్మాన్ ఖాన్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఈద్‌కి రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లు ఊదరగొడుతున్నారు.

ప్యాన్ ఇండియా టార్గెట్‌గా రిలీజ్ అవుతోన్న ఈ సినిమాలో ఇంతకీ, రామ్ చరణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నట్టు.? అదే ఇప్పుడు హాట్ టాపిక్. అయితే, ఈ గెస్ట్ అప్పియరెన్స్‌కి చరణ్ డబ్బులేమీ తీసుకోలేదట. సల్మాన్ ఖాన్‌తో రామ్ చరణ్‌కి వున్న ఫ్రెండ్‌షిప్ తెలిసిందే. అందుకే సల్లూ భాయ్ అడగ్గానే ‘ఓకే’ చెప్పేశాడట రామ్ చరణ్.

‘గాడ్ ఫాదర్’ విషయంలో కూడా సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తీసుకోలేదు. అది చిరంజీవి మీదున్న గౌరవం. అలాగే సల్మాన్ ఖాన్ మీదున్న గౌరవంతోనే చరణ్ ఇప్పుడిలా చేశాడట. ‘మా స్నేహాన్ని డబ్బుతో కొనలేరు’ అని సల్మాన్ ఖాన్ గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చేశాడు కూడా.! అదీ సంగతి.