మహేష్‌బాబుతో రాజమౌళి సినిమా ఎన్నేళ్ళు తీస్తాడో.!

‘బాహుబలి’ సినిమాని తొలుత ఒక్క పార్ట్‌గానే అనుకున్నారు.. కానీ, షూటింగ్ మధ్యలో నిర్ణయం మారింది.! కానీ, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి అలాంటి రిస్క్ తీసుకోలేదు రాజమౌళి. అయితే, ఇప్పుడు సినిమా గమనం మారింది.!

ఏదన్నా పెద్ద సినిమా అంటే, ఒకేసారి కుదరట్లేదు.! పార్టులు పార్టులుగా సినిమాలు తీసి జనం మీదకు వదలాల్సిందే. సినిమాటిక్ యూనివర్స్ అనీ, ఇంకోటనీ.. ఏవేవో కొత్త పేర్లు పెడుతూ, ‘కొనసాగింపుల’ పర్వం ఎక్కువైపోయింది.

రాజమౌళి – మహేష్ కాంబినేషన్‌లో సినిమా గురించి కూడా ఇప్పటికే దాదాపు ఓ క్లారిటీ వచ్చేసింది, దానికి కొనసాగింపులు వుంటాయని. గ్లోబల్ ట్రోటింగ్ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.

మహేష్‌బాబుకి సంబంధించి లుక్ టెస్ట్ తదితర వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తే, మంచి ముహూర్తం చూసుకుని, సినిమా షూటింగ్ ప్రారంభిస్తాడట రాజమౌళి. కానీ, ఎన్నేళ్ళు తీస్తాడు.? అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రెండేళ్ళపాటు మహేష్ డేట్స్‌ని రాజమౌళి లాక్ చేసినట్లు తెలుస్తోంది.

రెండేళ్ళంటే ఖచ్చితంగా మూడు నాలుగేళ్ళు పట్టొచ్చేమో.! అబ్బే, ఈసారి వేగంగానే తీస్తానని గతంలో ఇదే విషయమై ఓ ప్రశ్నకు సమాధానమిచ్చాడు రాజమౌళి. కానీ, నమ్మొచ్చా.?