మహేష్ బాబు మాటల మాంత్రికుడు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ ఇప్పటివరకు అయితే కేవలం ఒక 35% వరకే పూర్తయింది. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటికే రెండు మూడు సార్లు బ్రేకులు పడ్డాయి. అంతేకాకుండా ఇప్పటికీ కూడా దర్శకుడు త్రివిక్రమ్ మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా సతమతమవుతున్నాడు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడైతే సినిమాకు అసలు బ్రేకులు పడకూడదు. ఎందుకంటే సినిమాను నిర్మాతలు 2024 సంక్రాంతికి విడుదల చేయాలని చాలా బలంగా ఫిక్స్ అయ్యారు. మహేష్ బాబు టార్గెట్ కూడా అదే. అయితే సంక్రాంతికి వాళ్ళు అనుకున్నట్టుగా రిలీజ్ చేయాలి అంటే మిగిలిన 140 రోజులును జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.
ఏదేమైనా కూడా మరో వంద రోజుల్లోనే సినిమా షూటింగ్ పనులన్నీ కూడా ఫినిష్ చేసుకుని ఫ్రెష్ గా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. త్రివిక్రమ్ తలుచుకుంటే షూటింగ్ వేగంగా పూర్తి చేయగలడు. కానీ మహేష్ కంటెంట్ విషయంలో గతంలో మాదిరిగా ఏమాత్రం అసంతృప్తి వ్యక్తం చేసిన కూడా మళ్లీ ప్లాన్ అయితే ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఇక సంక్రాంతి మిస్ అయితే సమ్మర్లో సినిమాను విడుదల చేసుకోవాల్సి ఉంటుంది. కానీ వచ్చే ఏడాది సమ్మర్ కు పోటీ తీవ్రత చాలా ఎక్కువ స్థాయిలోనే ఉంది. కాబట్టి వీలైనంతవరకు సంక్రాంతికి రిలీజ్ చేసుకోకూడదు అని మహేష్ బాబు అనుకుంటున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన పాటల విషయంలో కూడా త్వరలోనే ఒక అప్డేట్ అయితే రాబోతోంది. మొదటిసారి ట్యూన్ కూడా ఇప్పటికే రెడీ అయిపోయింది. ఇక మహేష్ బాబు విని ఒకసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే పాటకు సంబంధించిన హడావిడిని మొదలుపెట్టాలని అనుకుంటున్నారు.