HIT The 3rd Case: హిట్ 3 టికెట్ హైక్స్‌.. నానికి కలిసొచ్చేనా?

నాని నటించిన క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3 విడుదలకు ముందు ఒక్కసారిగా టికెట్ ధరల పెంపుతో ఆసక్తికర పరిస్థితి నెలకొంది. సాంకేతిక జాప్యం కారణంగా లేట్ అయిన జీఓ ఇప్పుడు విడుదల కావడంతో, ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ స్క్రీన్‌లకు రూ.50, మల్టీప్లెక్సులకు రూ.75 అదనంగా వేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మే 7వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుంది.

ఇంత భారీ టికెట్ హైక్‌ను నాని సినిమాకు రావడం మొదటిసారి. గతంలో దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలు రెగ్యులర్ రేట్లతోనే హిట్స్ అయ్యాయి. అయితే ఈసారి హైక్ వల్ల కలిసొచ్చే లాభం కంటే, ఫ్యామిలీ ఆడియన్స్ టికెట్ ధరల వల్ల వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది. దీంతో యూత్, మాస్ ప్రేక్షకులే కలెక్షన్లను మోస్తారన్న దానిపై ఓ అంచనా నెలకొంది.

అయినా నాని కాన్ఫిడెన్స్ చూస్తే అభిమానుల్లో ఆశాభావం పెరుగుతోంది. బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఏపీకి చెందిన చాలా సెంటర్లలో ఫాస్ట్ ఫిల్లింగ్ కనిపించడంతో ప్రేక్షకుల ఆసక్తి బాగా కనిపిస్తోంది. పైగా ఉదయం 7 గంటల నుంచే షోలు వేయాలని అనుమతులు కూడా రావడంతో హిట్ 3కి మంచి స్టార్టింగ్ కలిగేలా మారింది.

శైలేష్ కొలను డైరెక్షన్‌లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు. యాక్షన్, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్లతోపాటు సర్‌ప్రైజ్ క్యామియోలు ఈ సినిమాకే హైలైట్ కానున్నాయని యూనిట్ చెబుతోంది. టాలీవుడ్‌లో గత నెల నుంచి సరైన హిట్ లేకపోవడంతో హిట్ 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టికెట్ హైక్స్ ఈ సినిమాకు లాభదాయకమవుతాయా లేదా అన్నది త్వరలోనే తేలిపోతుంది. అయితే కంటెంట్ బలంగా ఉంటే ధరలపై ఫోకస్ ఉండదన్నది నాని ఫాలోయింగ్ అభిప్రాయం.

కూటమి ఫెయిల్ || JD Lakshmi Narayana EXPOSED Chandrababu & Pawan Kalyan Ruling || Telugu Rajyam