గేమ్ చేంజర్ కోసం వచ్చిన హిట్ డైరెక్టర్

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తోన్న మూవీ గేమ్ చేంజర్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న ఈ మూవీ షూటింగ్ కి కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చారు. రామ్ చరణ్ కొంతకాలం ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేయడంతో షూటింగ్ వాయిదా పడింది. మరల చెర్రి ఈ మూవీ షూటింగ్ కోసం సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్ తో ఇండియన్ 2 మూవీ చేస్తున్నారు.

ఆ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మూవీ షూటింగ్ చివరి దశకి వచ్చేసినట్లు తెలుస్తోంది. మరో మూడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది. గేమ్ చేంజర్ ని మళ్ళీ సెట్స్ పైకి తీసుకొని వస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ కి సంబందించిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ని ప్రస్తుతం షూట్ చేస్తున్నారంట.

అయితే వీటిని శంకర్ కాకుండా హిట్ ఫ్రాంచైజ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. వాటికి సంబందించిన ఫోటోలు కొన్ని బయటకి వచ్చిన సినిమాకి అవసరమైన కొన్ని యాక్షన్ సన్నివేశాలని శైలేష్ దగ్గరుండి తెరకెక్కిస్తున్నారంట. శంకర్ పర్మిషన్ తోనే అతని సూచనలు, సలహాలు తీసుకొని వీటిని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక టాప్ డైరెక్టర్ సినిమా కోసం మరో చిన్న దర్శకుడు పని చేయడం టాలీవుడ్ లో మొదటి సారి జరుగుతోందని చెప్పొచ్చు. ఇండియన్ 2 సినిమాని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని నిర్మాత ఉదయనిది స్టాలిన్ ప్లాన్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ మూవీ మెజారిటీ షూటింగ్ పెండింగ్ లో ఉంది. దీంతో ఇండియన్ 2 తర్వాతనే ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

గేమ్ చేంజర్ సెట్స్ పైన ఉండగానే బుచ్చిబాబు సాన దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే ఛాన్స్ ఉందంట. ఆ మూవీ కోసం ఇప్పటికే క్యాస్టింగ్ ని బుచ్చిబాబు ఫైనల్ చేసింట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహమాన్ ని అనుకుంటున్నారు. పాన్ ఇండియా లెవల్ లోనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మూవీ ఉంటుందని టాక్.