ట్రైలర్ టాక్ : ఒరిజినల్ ని తలదన్నేలా హిందీ “ఛత్రపతి”.!

టాలీవుడ్ లో ఉన్న చాలా మంది హీరోస్ తాలూకా సినిమాలకి నార్త్ లో మంచి క్రేజ్ ఉంది. ఐతే ఇది యూట్యూబ్ లో వ్యూస్ రూపంలో మాత్రమే ఉంది. కాగా అలా భారీ సంఖ్యలో వ్యూస్ ఉండి అక్కడ తమ క్రేజ్ ని పరీక్షించుకోవాలని వెళ్లిన అల్లు అర్జున్ సక్సెస్ అయ్యి పాగా వేసేశాడు.

మరి ఇదే బాటలో తన జయ జానకి నాయక సినిమాకి ఇండియా లోనే హైయెస్ట్ వ్యూస్ అందుకున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా తెలుగు సినిమా “ఛత్రపతి” ని హిందీలో రీమేక్ కి వెళ్తున్నాడు. అయితే మొదట్లో ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పుడు బాగా ట్రోల్స్ వచ్చాయి కానీ అసలు సినిమా టీజర్ చూసాక ఒకొక్కరికి మైండ్ బ్లాక్ అయ్యింది.

పైగా దర్శకుడు వివి వినాయక్ కూడా ఓ రేంజ్ లో సినిమాని తెరకెక్కించడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మేకర్స్ అయితే సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రం మైండ్ బ్లాకింగ్ ఉందని చెప్పడంలో సందేహం లేదు. స్టోరీ ఎలాగో మనకి కూడా తెలిసిందే.

కాకపోతే హిందీ బ్యాక్ డ్రాప్ కొన్ని మార్పులు చేసినట్టుగా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సర్దార్ గబ్బర్ సింగ్ విలన్ శరద్ కేల్కర్ నటించారు. ఇంకా సినిమాలో విజువల్స్ సాలిడ్ గా భారీ నిర్మాణ విలువలతో కనిపిస్తున్నాయి.

ఇందుకు పెన్ స్టూడియోస్ వారు RRR, గంగూబాయి సినిమాలకి హిందీలో వచ్చిన లాభాలు అంతా ఈ సినిమాకి పెట్టినట్టుగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో కూడా బెల్లంకొండ శ్రీను మంచి డాన్స్ లతో ఇంప్రెస్ చేస్తున్నాడు. అమ్మ సెంటిమెంట్ కూడా బాగుంది.

ఓవరాల్ గా అయితే ఈ సినిమాకి మంచి మార్పులు చేసి గట్టిగానే ప్లాన్ చేసారని చెప్పొచ్చు. కానీ హిట్ అవుతుందా లేదా ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేది ప్రశ్నగా మారింది. ఒకవేళ హిట్ అయితే మాత్రం బాలీవుడ్ బన్నీ తర్వాత రాజమౌళి లేకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పాగా వేస్తాడని చెప్పొచ్చు.