“హాయ్ నాన్న” ఫస్ట్ సింగిల్..దీనికోసం అతనికి ఇంత బిల్డప్ ఇచ్చారా.. 

ఇప్పుడు ఉన్న రోజుల్లో అయ్యితే సినిమాలు అన్నిటికి మ్యూజిక్ నిజంగా చాలా మేజర్ రోల్ పోషిస్తుంది. సినిమా పై మంచి హైప్ తీసుకురావాలి అంటే మెయిన్ గా దాని ఫస్ట్ సింగిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాగా ఈ సాంగ్ హిట్ అయితే ఆటోమేటిక్ గా దానిపై మంచి బజ్ స్టార్ట్ అవుతుంది.

అలా రీసెంట్ గానే విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన చిత్రం “ఖుషి” కి ఓ సాలిడ్ సాంగ్ అయితే ఓయెద్ద హిట్ అయ్యింది. కాగా ఈ సినిమాకి సంగీతం ఇచ్చింది ఎవరా అని చూస్తే అప్పటికే మలయాళంలో మారు మోగుతున్న సంగీత దర్శకుడు అబ్దుల్ వాహద్ అని తెలిసింది.

కాగా ఇదే సంగీత దర్శకుడు నేచురల్ స్టార్ నాని హీరోగా సీతారామం ఫేమ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన చిత్రం అయితే “హాయ్ నాన్న”. మరి ఈ చిత్రం మళ్ళీ నాని కెరీర్ లో జెర్సీ తరహాలో నాన్న సెంటిమెంట్ తో కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తుండగా మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో దీనిని ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా నుంచి ఎంతో హైప్ ఇచ్చి తీసుకొచ్చిన ఈ సంగీత దర్శకుడు ఇచ్చిన సాంగ్ మాత్రం ఏమాత్రం కొత్తగా లేదు ఆల్రెడీ తెలుగులో విన్నదే ఎక్కడో మన వాళ్ళు కంపోజ్ చేసిందే మళ్ళీ వింటున్నాం అన్నట్టు ఉందని చెప్పక తప్పదు. మరి మనవాళ్ళు అయితే ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి. అయితే ఈ చిత్రం ఈ డిసెంబర్ 21న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది. 
Hi Nanna: Samayama Lyrical Video Song | Nani,Mrunal Thakur | Shouryuv | Hesham Abdul Wahab