తెలుగు సినిమాలలో హీరోయిన్లు కేవలం గ్లామర్ షో చేయడానికి మాత్రమే ఉంటారు: అమలాపాల్

తమిళ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అమలాపాల్ తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి సందడి చేశారు. ఇలా తెలుగులో కూడా ఈమె నాయక్ ఇద్దరమ్మాయిలు వంటి సినిమాలలో నటించి సందడి చేశారు. ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి అమలాపాల్ తాజాగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈమె పలు తెలుగు సినిమాలలో నటించినప్పటికీ ఇలా తెలుగు చిత్రపరిశ్రమ పట్ల చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కేవలం నాలుగు సినీ కుటుంబాలు మాత్రమే ఇండస్ట్రీని ఏలుతున్నాయని,ఈ కుటుంబం నుంచి వచ్చిన హీరోలు మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని అయితే ఆ హీరోలకు ఒక్కో సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉండాలంటూ షాకింగ్ కామెంట్ చేశారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అదేవిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు కేవలం హీరోలు పక్కన గ్లామర్ షో చేయడానికి అలాగే పాటలలో డాన్సులు వేయడానికి మాత్రమే తీసుకుంటారంటూ కామెంట్ చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చే సినిమాలలో హీరోయిన్ల పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత ఉండదని అయితే కోలీవుడ్ పరిశ్రమలో ఇలా కాదని హీరోయిన్ల పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందని ఈమె తెలిపారు. ఇలా తాను కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఉన్నందుకు చాలా అదృష్టవంతురాలు అంటూ ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే తెలుగులో ఈమె అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి హీరోలతో సినిమాలు చేసి వారిని విమర్శించడం పట్ల తెలుగు ప్రేక్షకులు మండిపడుతున్నారు.