‘యానిమల్’ భామా.! ఇది నిజమేనా.?

‘యానిమల్’ సినిమాతో రాత్రికి రాత్రి తెలుగునాట టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయి కూర్చుంది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి.! సందీప్ రెడ్డి వంగా తెలుగు తెరకు పరిచయం చేశాడు ఈ బ్యూటీని. నిజానికి, సినిమాలో త్రిప్తి దిమ్రి పెద్దగా చేసిందేమీ లేదు.. స్కిన్ షో తప్ప.!

రష్మిక మండన్న హీరోయిన్ అయినాగానీ, త్రిప్తి దిమ్రికి సపోర్ట్ ఆడియన్స్ నుంచి, సోషల్ మీడియా నుంచి గట్టిగా దక్కింది. అదో విచిత్రం.

ఇంకేముంది రవితేజ సినిమాలో త్రిప్తి దిమ్రి హీరోయిన్ అన్న ప్రచారం తెరపైకొచ్చింది. ఇంకో ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లతో త్రిప్తి దిమ్రి పేరుని లింక్ చేసి బోల్డన్ని గాసిప్స్ అల్లేశారు.

కానీ, అసలు విషయం ఏంటంటే, ఏ సౌత్ ప్రాజెక్టుకీ ఈ మధ్య త్రిప్తి దిమ్రి సైన్ చేయలేదట. ఓ ప్రాజెక్టుకి ఆల్మోస్ట్ సైన్ చేసేదాకా వెళ్ళినా, రెమ్యునరేషన్ దగ్గర పంచాయితీ కారణంగా, చివరి నిమిషంలో ఆ ప్రాజెక్టు నుంచి త్రిప్తి దిమ్రి తప్పుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

తాజాగా వినిపిస్తున్న ఊహాగానాల సారాంశమేంటంటే, ఓ యంగ్ హీరో సినిమాలో త్రిప్తి దిమ్రి వ్యాంప్ తరహా రోల్ చేయబోతోందని. ఓ స్పైసీ సాంగ్ కూడా ఆమె మీద డిజైన్ చేశారట. గట్టిగానే రెమ్యునరేషన్ కూడా అందుకుంటోందని సమాచారం.

వై త్రిప్తి దిమ్రి.? అంటే, ‘యానిమల్’ ఇచ్చిన ‘హై’ అలాంటిది మరి.! అందాల ప్రదర్శనకు అస్సలేమాత్రం మొహమాటపడదు గనుక, స్పెషల్ సాంగ్స్ అనగానే త్రిప్తి పేరు మార్మోగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.