శ్రీలీలకి ‘స్కంధ’ అగ్ని పరీక్షే సుమా.!

బోయపాటి శీను ‘స్కంధ’ సినిమా విషయంలో చాలా అతి చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయ్ ఆడియన్స్‌లో. గతంలో ‘వినయ విధేయ రామ’ సినిమా టైమ్‌లో ఆయన ఇదే తరహా ఓవరాక్షన్ చేశారు.

తీరా చూస్తూ సినిమా హుష్ పటక్ అయ్యింది. చరణ్ పుణ్యమా అని నిర్మాతలు సేఫ్ అయ్యారు కానీ, సినిమాకి దారుణమైన టాక్ వచ్చింది. మరి, ఇప్పుడు ‘స్కంధ’ విషయంలోనూ రామ్ ఫ్యాన్స్‌లో ఇదే ఆందోళన నెలకొందట.

అలాగే, శ్రీలీలకీ ఓ పక్క టెన్షన్ మామూలుగా లేదట. బోయపాటి తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే.

తెలుగులో ఆమె నటించిన రెండో సినిమా ఇది. తొలి చిత్రం ‘భరత్ అనే నేను’‌తో హిట్ కొట్టింది. ద్వితీయ విఘ్నం ‘వినయ విధేయ రామ’ రూపంలో వెంటాడేసింది కియారా అద్వానీకి.

ఈ దెబ్బతో టాలీవుడ్‌ని వదిలి వెళ్లిపోవల్సి వచ్చింది కియారా అద్వానీకి. అలాగే, ‘అఖండ’ సినిమా తీసుకుంటే, ప్రగ్య జైశ్వాల్‌కి మంచి బౌన్స్ బ్యాక్ వచ్చిందనుకున్నారంతా.

కానీ, ఆ సినిమా తర్వాత మరో సినిమానే లేదు ప్రగ్యాకి. హిట్ సినిమాలో నటించినా కూడా ప్రగ్యా పరిస్థితి అలాగైపోయింది.

మరి, ‘స్కంధ’తో శ్రీలీలకి అటూ ఇటూ ఏమైనా అయ్యిందంటే.. ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఆమె తదుపరి సినిమాలపై పడుతుంది.

ఒకటి కాదు, రెండు కాదు.. డజన్ల కొద్దీ సినిమాలు శ్రీలీల చేతిలో వున్నాయ్ ప్రస్తుతం. అయినా కానీ, వాటన్నింటికీ ‘స్కంధ’ రిజల్ట్ ప్రామాణికం అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. అందుకే ‘స్కంధ’తో ఆషా మాషీ కాదు. అటు రామ్‌కీ, ఇటు శ్రీలీలకీ.. ఇద్దరికీ ఈ సినిమా అగ్ని పరీక్షే సుమీ.!