సాయేషా సైగల్ తెలుగు తమిళ కన్నడ భాషల్లో బిజీ హీరోయిన్‌గా ఫుల్ పాపులర్ అయింది. అయితే సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ వ్యవహారాలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది. హీరో ఆర్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఇద్దరి మధ్య ఉన్న వయో భేదం అప్పట్లో తెగ వైరల్ అయింది. అయినా కూడా ఈ ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడంతో అవేమీ అడ్డంకిగా మారలేదు. పెళ్లి అనంతరం సాయేషా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అవుతూ వచ్చింది.
లాక్డౌన్ కాలంలో సాయేషా వేసిన స్టెప్పులు, క్లాసిక్ డ్యాన్స్‌తో చేసిన మ్యాజిక్ మామూలుగా లేదు. ఓ వైపు క్లాసికల్ స్టెప్పులు వేస్తూనే మరో వైపు మోడ్రన్ డ్యాన్సులతో దుమ్ములేపేది. మధ్యలో గర్భం దాల్చిందంటూ వార్తలు కూడా వచ్చాయి. వాటిపై సాయేషా అంత ఎత్తున లేచింది. మీకేం పని లేదా? మా పర్సనల్ విషయాల మీదే శ్రద్ద చూపిస్తున్నారంటూ ఫైర్ అయింది. తానేమీ గర్భం దాల్చలేదని ఆ వార్తలను ఖండించింది. తాజాగా సాయేషా ఓ పోస్ట్ చేసింది.
తనలోని మరో కోణాన్ని, ఇంకో కొత్త ప్రతిభను అందరికీ చూపించేసింది. అయితే ఆ ప్రతిభ తన చుట్టూ ఉండే అతి కొంత మందికి మాత్రమే తెలుసట. ఐదేళ్ల వయసులోనే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించిందట. అతి తన ప్యాషన్ అని తన చుట్టు ఉన్న కొద్ది మందికి మాత్రమే తెలుసట. సంగీతంతో ఉన్నప్పుడు నాలో ఓ మనశ్శాంతి ఉంటుంది.. అదే ఫీలింగ్ మారా సినిమా చూసినప్పుడు కూడా కలిగిందంటూ చెప్పుకొచ్చింది. మారా సినిమాలో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ పోస్ట్ చేసింది.