మళయాలంలోనూ అడుగు పెడుతున్న సమంత!

సమంత క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ కోట్లాదిమంది ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకుంది. గ్లామరస్‌ పాత్రలతోపాటు పర్‌ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ రోల్స్‌తో ఇంప్రెస్‌ చేసే సమంత ఇప్పటివరకు మాలీవుడ్‌లో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడిక మలయాళ చిత్రపరిశ్రమలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయిందన్న వార్త ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఈ భామ మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి సినిమాతో ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో కనిపించబోతుందని ఓ అప్‌డేట్‌ ఫిలింనగర్‌ సర్కిల్‌లో రౌండప్‌ చేస్తోంది. పోలీస్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రం హోం బ్యానర్‌ మమ్ముట్టి కంపెనీ తెరకెక్కించనుంది. గౌతమ్‌ విూనన్‌ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా నటించనున్న చిత్రంతో సామ్‌ మాలీవుడ్‌ డెబ్యూ ఫైనల్‌ అయినట్టు వార్తలు వస్తుండగా.. దీనిపై ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.

సామ్‌, మమ్ముట్టి ఇప్పటికే ఎఅఒ ఈతినిఞనీసూ యాడ్‌లో కనిపించారని తెలిసిందే. గతేడాది గుణశేఖర్‌ దర్శకత్వంలో నటించిన ఫీ మేల్‌ ఓరియెంటెడ్‌ మూవీ శాకుంతలం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో టాక్‌ తెచ్చుకోలేకపోయింది. ఇక శివనిర్వాణ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం బాలీవుడ్‌ యాక్టర్‌ వరుణ్‌ ధవన్‌తో కలిసి సిటడెల్‌ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది సమంత.