పుష్ప సామీ సామీ పాట కోసం రెండు బంగారు గాజులను అమ్ముకున్న హీరోయిన్.. ఎవరంటే?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నటువంటి పాన్ ఇండియా స్థాయి చిత్రం పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో నుంచి విడుదలైన ప్రతి పోస్టర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులో
సామీ.. సామీ అంటూ సాగే ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ పాటను కవర్ సాంగ్ చేయడం కోసం హీరోయిన్ రేఖ బోజ్ ఎంతో కష్టపడి కవర్ సాంగ్ చేసింది.

ఈమె హీరోయిన్ గా ఎన్నో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఈమెకు అవకాశాలు రాకపోవడంతో ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వీడియో కవర్ సాంగ్స్ చేస్తూ విశేషమైన ఆదరణ దక్కించుకున్నారు.ఈ క్రమంలోనే పుష్ప సినిమాలోని ఈ పాటను చేయడం కోసం ఎంతో కష్టపడ్డారని సినిమా ఒరిజినల్ గా రావడానికి ఏకంగా తన రెండు బంగారు గాజులను అమ్ముకున్నానని ఈ సందర్భంగా వెల్లడించారు.

రియాలిటీకి దగ్గరగా ఉండేలా ప్రతి ఒక్క లొకేషన్ సెట్ చేసుకొని ఈ పాటకు డాన్స్ చేశాము. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం అందాలంటే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులను కోరారు. ఈ క్రమంలోనే ఈమె చేసిన ఈ వీడియో సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.