పెళ్లి తర్వాత కాజల్ తెలుగులో బాలయ్య సరసన భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నారు. శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది.శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. దసరాకు విడుదలకానుంది.
కాజల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 60వ సినిమాకి సత్యభామ పేరు ఖరారు చేశారు. ఈ సినిమాని ఔరం ఆర్ట్స్ నిర్మిస్తోంది. అయితే ఈరోజుల్లో 60 చిత్రాలు పూర్తి చెయ్యడం అంటే మాటలు కాదనే చెప్పోచ్చు. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
కాజల్ ప్రస్తుతం ఇండియన్2 మూవీ లో నటిస్తుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముఖం దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై కాజల్ అగర్వాల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుందని తెలుస్తోంది.
దీంతో పాటు కాజల్ తెలుగులో ఆచార్య తర్వాత బాలయ్య సినిమాలో నటిస్తోంది కాగా ఈ సినిమాలో కాజల్ నటించడానికి భారీగా డిమాండ్ చేసిందట. ఆమె అడిగిన మొత్తాన్ని కూడా ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయ్యారట. ఈ సినిమాలో నటించడానికి కాజల్‌కు 4 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరాకు విడుదలకానుంది. ఇక కాజల్, శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఇండియన్ 2లో కీలకపాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలై, కొన్నాళ్లు షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లినప్పటీ నుంచి ఏదో ఒక రూపంలో అవాంతరాలు వచ్చి పూర్తికాకుండా పోయింది.
ఈ సినిమా కొంత భాగం షూటింగ్ జరిగిన తరువాత.. సెట్లో ప్రమాదం జరగడం.. ఆ తర్వాత నటుడు వివేక్ మృతి, దీనికి తోడు దర్శకుడు శంకర్‌కు, లైకా ప్రొడక్షన్స్ మధ్య అభిప్రాయ భేదాలు రావడం ఇలా కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్లు.. అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగింది. ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు శంకర్.. రామ్ చరణ్‌తో ఓ సినిమాను స్టార్ట్ చేశారు.
ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక ఆ సినిమా అలా ఉండగానే శంకర్ భారతీయుడు2 కూడా రెస్యూమ్ చేశారు.. ఈ సినిమా 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్, కాజల్‌లతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుంది. చందమామ కాజల్ తన అందచందాలతో పాటు నటనతో కొన్నాళ్లపాటు తెలుగులో అలరించారు. ఇక ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ప్రస్తుతం సినిమాలకు విరామం ఇచ్చారు. అయితే ఆమె చిరవగా చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన ఆచార్యలో నటించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేశారు. అయితే ఆమె నటించిన ఆ పార్ట్‌ను దర్శక నిర్మాతలు తొలగించారు.