అవును… రిలేషన్‌షిప్‌లోనే ఉన్నానంటోంది కృతిశెట్టి!?

తన తాజా సినిమా ‘మనమే’ ప్రమోషన్‌లో బిజీబిజీగా గడుపుతున్నది బెంగళూరుభామ కృతిశెట్టి. వరుసపెట్టి టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నది. ఈ క్రమంలో ఎదురవుతున్న చిలిపి ప్రశ్నలకు కూడా తెలివిగా సమాధానాలిచ్చేస్తున్నది ఈ అందాల బేబమ్మ. ‘విూరు సింగిలా? రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘నేను సింగిల్‌ కాదు. రిలేషన్‌లోనే ఉన్నా’ అని సూటిగా సమాధాన మిచ్చేసింది.

‘ఎవరితో?’ అనడిగితే.. ‘నా పనితో.. నా పనితో రిలేషన్‌లో ఉన్నా’ అంటూ నవ్వులు పూయించేసింది కృతిశెట్టి. కాబోయేవాడు ఎలావుండాలి? అనడిగితే.. ‘మంచివాడై ఉండాలి. నిజాయితీపరుడై ఉండాలి. సాటివారిపై దయ కలిగినవాడై ఉండాలి’ అంటూ అందంగా నవ్వేసింది. ఇంకా చెబుతూ ‘నాకు డ్యాన్స్‌ చేయడం ఇష్టం. యాక్షన్‌ సినిమాలు ఇష్టం. హీరోల్లో రామ్‌చరణ్‌ అంటే అభిమానం. కలిసి నటించే అవకాశం వస్తే మిస్‌ చేసుకోను’ అంటూ చెప్పుకొచ్చింది కృతిశెట్టి.