ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఎన్నో పెద్ద సినిమాలను వదిలేసానంటున్న హీరో శ్రీరామ్!

టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయడం అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి శ్రీకాంత్ గా అతను వచ్చినప్పటికీ తెలుగులో మాత్రం శ్రీరామ్ గానే బాగాపాపులర్ అయ్యాడు. రోజాపూలు సినిమాతో కెరీర్‌ ప్రారంభించిన హీరో శ్రీరామ్‌ తెలుగు, తమిళంలో మంచి క్రేజ్‌ అందుకున్నాడు.

మొదట హీరోగా సినిమాలు చేసిన శ్రీరామ్ అయితే ఆ తర్వాత మాత్రం ఆశించినంత స్థాయిలో సక్సెస్‌ అందుకోలేదు. దీంతో సరైన హిట్స్‌ లేక సైడ్‌ క్యారెక్టర్లు సైతం చేశాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తెలుగులో ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, స్నేహితుడు లాంటి చిత్రాలు శ్రీరామ్ కి గుర్తింపు తీసుకొచ్చాయి. నటుడు శ్రీరామ్ తదుపరి టెన్త్ క్లాస్ డైరీస్ లో కనిపించాడు.

ఇక కొన్నేళ్లుగా హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ రాణిస్తున్నాడు శ్రీరామ్. టెన్త్ క్లాస్ డైరీస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జూలై ఒకటిన ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది. దీనితో ఆ సినిమా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొన్నాడు. ఇందులో భాగంగా యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రాంలో కూడా పాల్గొనడం జరిగింది.

అయితే టెన్త్ క్లాస్ డైరీస్ మూవీ గురించి మాట్లాడుతూ సినిమాటోగ్రాఫర్‌గా మారిన దర్శకుడు అంజితో తనకు మంచి అనుబంధం ఉందనీ వాళ్లిద్దరూ తమిళంలో సినిమా చేయాల్సి ఉంది కానీ అది కుదరలేదనీ చెప్పాడు. అప్పుడు నాతో మొదటి సినిమా చేయమని చెప్పడం జరిగింది.

గతంలో ఓ షోకి హాజరైన శ్రీరామ్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలో శ్రీరామ్ ఎంతో ఉత్సాహంగా కనిపించి.. చివరిలో అందరినీ ఎమోషనల్ చేశాడు. తన కెరీర్ తో పాటు వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకున్న శ్రీరామ్.. హీరోగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఓ సినిమా షూటింగ్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్ల తాను వెనకబడ్డానని తెలిపాడు. షూటింగ్ టైంలో ఆర్ట్‌ అసిస్టెంట్‌కి తెలియకుండా ఎక్కువ రబ్బర్‌ పోసేసాడు. దీని వల్ల పెద్ద ఫైర్‌ జరిగింది. ఈ ప్రమాదంలో షర్ట్‌తో సహా శరీరం ఊడిపోయి వచ్చిందనీ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. చెవులు, జుట్టు ఉండేది కాదు. ఆ ఫైర్ యాక్సిడెంట్ లో తన ముఖంతో పాటు పెదాలు, ముక్కు, కాళ్ళు చేతులు, జుట్టు ఇలా మొత్తం కాలిపోయానని, ఆ టైంలో నరకం అనుభవించానని చెబుతూ కంటతడి పెట్టుకున్నాడు. అలా కాలిపోయి హాస్పిటల్‌లో కదల్లేని స్థితిలో ఉండేవాడిని అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. మరి శ్రీరామ్ చెప్పిన ఈ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ రోజుల్లో సహాయపాత్రలు చేయమని సన్నిహితులు కోరితే తప్ప తిరస్కరిస్తున్నాననీ చెప్పుకుంటూ వచ్చాడు శ్రీరామ్. అయితే అతను రవితేజ ‘రావణాసురుడు’లో సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నానీ చెప్పాడు. అతనికి తెలుగు సినిమాలు చేయడం అంటే చాలా ఇష్టమని చెప్పుకుంటూ వచ్చాడు. అతను స్క్రిప్ట్స్ బాగుంటేనే నటిస్తాననీ లేకపోతే, అతని దగ్గర తమిళ సినిమాల అవకాశాలు ఉన్నాయనీ చెప్పడం జరిగింది.

అతనికి ప్రస్తుతం కోలీవుడ్‌లో 6 సినిమాలు ఉన్నాయనీ ఇంకా ఇటీవలే తెలుగు వెబ్ సిరీస్‌లో కూడా నటించిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా అంజితో మరో ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుగుతున్నాయి. రసూల్ ఎల్లోర్ కూడా తన కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. వాటిని ఖరారు చేసిన తర్వాత ప్రకటిస్తాననీ తెలిపాడు శ్రీరామ్.