చిన్న హీరో డేరింగ్ స్టెప్

శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సామజవరగమన. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సిద్ధమైన ఈ మూవీ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ లో రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం ప్రీమియర్ షోలు వేయడానికి నిర్మాత సిద్ధం అవుతూ ఉండటం విశేషం. పెద్ద పెద్ద హీరోలు కూడా ప్రీమియర్స్ వేయడానికి భయపడుతున్నారు. శాకుంతలం సినిమాకి ప్రీమియర్ వేసి ఎంత దెబ్బ తిన్నారో అందరికి తెలిసిందే. ఆదిపురుష్ సినిమాకి ప్రీమియర్స్ ఎనౌన్స్ చేసి మరీ క్యాన్సిల్ చేశారు. అలాగే ఎవరూ కూడా ప్రీమియర్ షోల వైపు మొగ్గు చూపించడం లేదు.

ఏ మాత్రం కంటెంట్ తేడా కొట్టిన రివ్యూల కారణంగా ఓపెనింగ్ కూడా రావడం కష్టం అయిపోతాయని నిర్మాతలు భయపడి ప్రీమియర్స్ జోలికి పోవడం లేదు. అయితే శ్రీవిష్ణు సామజవరగమన సినిమాకి మాత్రం ప్రీమియర్స్ వేయడం సాహసమనే చెప్పాలి. హైదరాబాద్‌ తో పాటు విజయవాడ, వైజాగ్, నెల్లూరు, గుంటూరు, కడప, కాకినాడ, ఏలూరులో ప్రీమియర్లను ప్లాన్ చేశారు.

జూన్ 26న ప్రీమియర్స్ వేయడానికి సిద్ధం అయ్యారు. సాయంత్రం 7:30 గంటలకి ప్రదర్శించనున్నారు. ఇక థియేటర్స్ లిస్టు కూడా రిలీజ్ చేశారు. సినిమా అవుట్ పుట్ మీద నమ్మకంతోనే ప్రీమియర్స్ వేయడానికి ప్లాన్ చేస్తున్నాట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో రెబా మోనిక హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇప్పటికే మలయాళంలో హీరోయిన్ రాణిస్తోంది.

ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. శ్రీవిష్ణు చివరిగా అల్లూరి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. మరి ఈ సినిమా ఏ మేరకు శ్రీవిష్ణుకి సక్సెస్ ఇస్తుందనేది వేచి చూడాలి. ఈచిత్రంలో సీనియర్ యాక్టర్ నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు.