అదితితో సిద్దార్థ్‌ రహస్య వివాహం!

కోలీవుడ్‌ హీరో సిద్దార్థ్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. తెలుగు నటి అదితి రావు హైదరీని సిద్దార్థ్‌ వివాహం చేసుకున్నట్లు సమాచారం. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో ఈ పెళ్లి జరుగగా.. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితులు ఈ వివాహానికి హాజరయినట్లు తెలుస్తుంది.

అయితే వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో నటి అదితి రావు హైదరి కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. దీంతో పురోహితులు దగ్గరుండి ఈ పెళ్లి జరిపించినట్లు సమాచారం. అయితే ఈ పెళ్లిపై అటు సిద్దార్థ్‌ కానీ.. ఇటు అదితి రావు హైదరీ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.