నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు: నాని

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా సినిమాతో మార్చి 30న ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన ఈ సినిమాని ఏకంగా ఐదు భాషలలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాపై నాని చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ పై నాని పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాడు అని చెప్పాలి.

సినిమాని ప్రేక్షకులకి చేరువ చేయడం కోసం అటు నార్త్ ఇండియా ఇటు సౌత్ ఇండియా మొత్తం కవర్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా తన కెరియర్ గురించి అలాగే దసరా సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆ మధ్య కాలంలో ఓ ప్రెస్‌మీట్‌లో నాని స్టార్ దర్శకుడు సుకుమార్ పై చేసిన కామెంట్స్ కాస్త వైరల్ అయ్యాయి.

పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా ఒక కొత్త దర్శకుడితో చేయడంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన సందర్భంగా సుకుమార్ తో శ్రీకాంత్ ని పోల్చి చెప్పారు. పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసినప్పుడు సుకుమార్ కూడా మిగిలిన భాషలకు కొత్త దర్శకుడే కదా అని పేర్కొన్నారు. అయితే దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ మిగిలిన భాషలతో పాటు తెలుగు ఇండస్ట్రీ కూడా కొత్త డైరెక్టర్ అని అన్నాడు.

అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై కొంతమంది నెటిజన్లు నాని సుకుమార్ ని అవమానించాడు అంటూ పోస్టు పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అప్పుడు చేసిన వ్యాఖ్యలపై నాని మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి పొరపాటు లేదని, ఒక్కసారి మాట్లాడిన మాటలు సందర్భం బట్టి ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటారని అన్నారు.

అలాగే ఆ రోజు సుకుమార్ మిగిలిన భాషలకు కొత్త దర్శకుడు చెప్పానంటే అతనిని తగ్గించినట్లు కాదని పేర్కొన్నారు. తన దర్శకుడు టాలీవుడ్ తో పాటు మిగిలిన భాషలకి కూడా కొత్త దర్శకుడు, అయితే సుకుమార్ తెలుగులో స్టార్ అయిన మిగిలిన భాషలలో అతనికి అదే మొదటి సినిమా అని చెప్పడమే నా ఉదేశ్యం. అతని తరహాలోనే దసరా మూవీ దర్శకుడు కూడా ఆకట్టుకుంటాడు అని చెప్పడమే తన అభిప్రాయం అని పేర్కొన్నారు.