బన్సాలీ ‘హీరామండి’ ట్రైలర్‌ విడుదల!

బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న తాజా వెబ్‌ సిరీస్‌ ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌’. ఈ సిరీస్‌తోనే డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌లోకి అడుగు పెడుతున్నారు భన్సాలీ. పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్‌ హైదరీ, రిచా చద్దా, షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ నెట్‌ప్లిక్స్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ మే 01 నుంచి అందుబాటులోకి రానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడటంతో సిరీస్‌ నుంచి మేకర్స్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. ట్రైలర్‌ గమనిస్తే.. ఇండిపెండెన్స్‌కు ముందు పాకిస్తాన్‌ లాహోర్‌లోని హీరామండి అనే ప్రాంతంలో వేశ్యలు ఉండగా.. ఈ ప్రాంతాన్ని మల్లికాజాన్‌ (మనీషా కొయిరాలా) పరిపాలిస్తుంటుంది.

అయితే ఈ ప్రాంతాన్ని తమ గుప్పట్లోకి తెచ్చుకోవాలని బ్రిటీష్‌ వాళ్లు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే మల్లికాజాన్‌ (మనీషా కొయిరాలా) ఏం చేసింది. అన్నింటిని ఎదుర్కొని హీరామండిలో చివరకు ఎవరు రాజ్యమేలుతారు? అనే స్టోరీతో ఈ వెబ్‌ సిరీస్‌ వస్తుంది. ఈ చిత్రానికి భన్సాలీతో పాటు విభు పూరి, మితాక్షర కుమార్‌ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌తో పాటు గ్లింప్స్‌ విడుదల చేయగా. ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.