ఆ పాత్ర వల్ల తనకి పెళ్ళి కాదని కామెంట్స్ చేశారు..ఆవేదన వ్యక్తం చేసిన నాని విలన్?

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి ( ఎంసీఏ ) సినిమా మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన విజయ్ వర్మ ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందాడు. ఇక విజయ్ వర్మ బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించాడు. ఇలా ఎప్పుడూ నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఇదిలా ఉండగా విజయ్ వర్మ ప్రస్తుతం ‘డార్లింగ్స్’ అనే బాలీవుడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమాలో అలియా భట్ కూడా కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

డార్లింగ్స్ అనే సినిమాలో విజయ్ వర్మ నటన చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో అతని నటనకు చాలా ప్రశంశలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో విజయ్ వర్మ నటించిన పాత్ర వల్ల తనకి పెళ్ళి కాదని విజయ్ వర్మ తల్లి భయపడిందట. స్వయంగా ఈ విషయాన్నీ విజయ్ వర్మ వెల్లడించాడు. డార్లింగ్స్ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో విజయ్ వర్మ ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో విజయ్ వర్మ సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో విజయ వర్మ మాట్లాడుతూ… డార్లింగ్స్ సినిమాలో తాను నటించిన పాత్రకు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయని వెల్లడించాడు.

డార్లింగ్స్ సినిమాలో విజయ్ వర్మ హమ్‌జా అనే పాత్రలో నటించాడు. ఈ సినిమాలో విజయ్ నటించిన పాత్ర మద్యానికి బానిసైన వ్యక్తి ప్రేమించి పెళ్లాడిన భార్యను అనుమానంతో చిత్రహింసలు పేడతాడు. ఈ పాత్రలో నటించినందుకు విజయ వర్మ నటనకు ప్రశంసలు అందుకున్నాడు. అయితే తన నటన గురించి వస్తున్న ప్రశంసల పట్ల విజయ్ వర్మ ఆనందంగా వ్యక్తం చేశాడు. అయితే ఈ సినిమా చూసిన తర్వాత నా తల్లి మాత్రం చాలా బాధ పడింది అంటూ చెప్పుకొచ్చాడు. సినిమా అయిపోయిన తర్వాత మా అమ్మ భయపడుతూ నన్ను దగ్గరకు పిలిచి.. “ఈ సినిమా చూసి నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు?” అని అడిగింది. అమ్మా.. ఇది కేవలం సినిమా మాత్రమే. నువు భయపడకు అని నేను ధైర్యం చెప్పడంతో అమ్మ కాస్త కుదుటపడింది అని విజయ్ వర్మ వెల్లడించాడు.