నితిన్ ని గమనించారా .. ” చెక్ ” లో అలాంటి హీరోయిన్స్ నే తీసుకున్నాడు ..?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ అఆ.. తర్వాత మళ్ళీ ఈ ఏడాది ప్రారంభం లో భీష్మ అన్న సినిమాతొఇనే హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో సక్సస్ ట్రాక్ ఎక్కిన నితిన్ వరసగా సినిమాలని లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం నితిన్, కీర్తి సురేష్ జంటగా రంగ్ దే చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలని జరుపుకుంటున్న ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

Rang De': First Look hits the right notes -

రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక నితిన్ తన నెక్స్ట్ సినిమా చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేస్తున్నాడు. చెక్ అన్న టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థ్రిల్లిర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని భవ్య క్రియోషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Nithiin, Priya Prakash Varrier & Rakul Preet Singh Starrer Check's  Poster... | Trendy Cow

కాగా ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. 2021 సమ్మర్ కి రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు అందరిని షాక్ కి గురి చేస్తోంది. అదేమిటంటే ఈ సినిమాకి ఎంచుకున్న హీరోయిన్స్. రకుల్ గత కొంతకాలంగా సక్సస్ లకి దూరంగా ఉంది. ఇక ప్రియా ప్రకాష్ వారియర్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకొస్తుంది. కన్నుకొట్టి పాపులర్ అయిన ఈ బ్యూటికి ఇప్పుడు క్రేజ్ తగ్గిపోయిందంటున్నారు.

Megha Akash Wiki, Bio, Age, Height, Weight, Facts

కాగా రీసెంట్ గా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా మేఘా ఆకాష్ ని తీసుకోనున్నారని అంటున్నారు. గతంలో నితిన్ – మేఘా ఆకాష్ కలిసి లై, ఛల్ మోహన రంగ సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు ఫ్లాపయ్యాయి. అయినా మరోసారి మేఘా ఆకాష్ నే ఎంచుకోవడం ఫ్యాన్స్ ని కలవరపెడుతున్న విషయం. అంతేకాదు ఇప్పుడు చెక్ సినిమాకి తీసుకున్న హీరోయిన్స్ గురించి ఆలోచిస్తే ఎవరికీ క్రేజ్ లేనివాళ్ళే అంటున్నారు. మరి నితిన్ ప్లాన్ ఏంటో తెలియాలంటే సినిమా రిలీజవ్వాల్సిందే.