సమంతకి మరో ఛాన్స్ చేజారిపోయె.! అయ్యో.!

సమంత కెరీర్ గ్రాఫ్ పడిపోతోందా.? అంటే అవుననే అంటున్నాయ్ టాలీవుడ్ వర్గాలు. ఓ ప్రముఖ హీరో సరసన సమంత నటించాల్సి వుందట.. అనూహ్యంగా ఆ సినిమా నుంచి సమంతని పక్కకి తప్పించేశారట.

‘శాకుంతలం’ రిలీజ్‌కి కొద్ది రోజుల ముందే ఆ ప్రాజెక్ట్‌పై సమంత సైన్ చేసిందట. ఇక త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి వుండగా.. ఇంతలోనే ఆమె ప్రాజెక్టులోకి మరో హీరోయిన్‌ని తీసుకున్నారట.

‘శాకుంతలం’ రిజల్టే అందుకు కారణమా.? ఇంకైదేనా బలమైన కారణం వుందా.? అంటే రకరకాల గాసిప్‌లు ప్రచారంలో వున్నాయ్. ఇంతకీ ఏంటా సినిమా.? ఎవరా హీరో.? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. సమంత త్వరలో ‘సిటాడెల్’ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.

ఈ సిరీస్‌పై భారీ అంచనాలున్నాయ్. ఈ సిరీస్ కోసం సమంత యాక్షన్ గాళ్‌గా బోలెడన్ని సాహసాలు చేసింది. తన ఆరోగ్య పరిస్థితిని సైతం పక్కన పెట్టేసి, కమిట్మెంట్‌తో కష్టపడింది.

చూడాలి మరి, సమంత కష్టం స్క్రీన్‌పై ఎలా వర్కవుట్ అయ్యిందో, ఈ సిరీస్‌తో సమంత గ్రాఫ్ మళ్లీ పెరగనుందో.! తెలియాలంటే ఏప్రిల్ 28 వరకూ ఆగాల్సిందే.