హరీష్ శంకర్, బండ్ల గణేష్ మధ్య లాక్ డౌన్‌లో జరిగిన గొడవలు అందరికీ తెలిసిందే. ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేల్చుకున్నారు. గబ్బర్ సింగ్ 8ఏళ్ళయిన సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ బండ్ల గణేష్ గురించి ప్రస్థావించలేదు. అలా ఈ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆ విషయంలో హర్ట్ అయిన బండ్లన్న హరీష్ శంకర్‌ను రీమేక్ దర్శకుడంటూ కించపరిచాడు. హరీష్ శంకర్ కూడా బండ్ల గణేష్‌ను ఓ రేంజ్‌లో ఏకిపారేశాడు.
ఇలా ఆ ఇద్దరి మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. అయితే బండ్ల గణేష్‌కు కరోనా రావడం, దాన్నుంచి కోలుకవడంతో పూర్తిగా మారిపోయాడు. అందరూ మంచివారే..అందరితో మంచిగా ఉండాలి.. ఎవ్వరిపైనా నోరు జారొద్దు.. అందర్నీ గౌరవించాలి అంటూ మంచివాడిగా మారిపోయాడు. ఆ మధ్య ఇంటర్వ్యూల్లో కూడా మాట్లాడుతూ హరీష్ శంకర్‌కు సారీ చెప్పాడు. తాజాగా సోషల్ మీడియాలో వేదికగా మరోసారి క్షమాపణలు చెప్పాడు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హరీష్ శంకర్ ఫైనేస్ట్ డైరెక్టర్. సార్.. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి. నాకు మీతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను చేయాలని ఉందని బండ్లగణేష్ ట్వీట్ చేశాడు. ‘సార్ దయచేసి అలా అనకండి. మీరు నా బ్రదర్ లాంటి వాళ్ళు. నా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ సినిమా మనకంటే చాలా గొప్పది. అందుకే గొప్ప సినిమాలతో మరింత గొప్పగా జీవించాల’ని హరీష్ శంకర్ కోరుకున్నాడు.