ఇండస్ట్రీ టాక్ : ఆరోజున “హరిహర వీరమల్లు” బ్లాస్టింగ్ ట్రీట్.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా దీనిపై భారీ అంచనాలు కూడా అన్ని భాషల్లో నెలకొన్నాయి.

మరి గత సెప్టెంబర్ లో పవన్ బర్త్ డే కానుకగా చిత్ర బృందం ఓ పవర్ ఫుల్ గ్లింప్స్ ని ఐతే రిలీజ్ చేయగా దీనితో పాన్ ఇండియా లెవెల్లో సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇది బాగానే ఉండగా అక్కడ నుంచి సినిమా షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ కాగా ఇప్పుడు కీలక షెడ్యూల్ ని అయితే పవన్ కంప్లీట్ చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉండగా ఇపుడు సినిమా నుంచి రానున్న మరో బ్లాస్టింగ్ అప్డేట్ కోసం ఇప్పుడు సినీ వర్గాల్లో లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీనితో అయితే ఈ ఏడాది చివరకి అంటే డిసెంబర్ 31న ఓ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ నే చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి దీనిపై అధికారిక అప్డేట్ రావచ్చని సినీ వర్గాల వారు చెప్తున్నారు.

మరి ఈ సినిమాకి అయితే ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే మెగా సూర్య ప్రొడెక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు లేదా జూన్ కి వెళ్లే ఛాన్స్ ఉన్నట్టుగా అంటున్నారు.