విజువల్‌ వండర్‌గా ‘హనుమాన్‌’

క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి వస్తున్న ఫస్ట్‌ ఇండియన్‌ ఒరిజినల్‌ సూపర్‌ హీరో మూవీ ’హను`మాన్‌’. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ మాగ్నమ్‌ ఓపస్‌ చిత్రం.. టీజర్‌, పాటలు, ట్రైలర్‌కి వచ్చిన ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో గ్లోబల్‌ లెవల్‌లో క్రేజ్‌ సంపాదించుకుంది.

హను`మాన్‌ సంక్రాంతి కానుకగా 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సినిమా విడుదలకు ఒక రోజు ముందే ప్రీమియర్‌ షోలు ప్రకటించగా.. టికెట్లు అన్నీ హాట్‌ కేక్‌లా అమ్ముడైపోయాయి. దీంతో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా వేచి చూస్తున్నారనేది అర్థమవుతోంది.

తాజాగా ఈ సినిమాను చూసిన బాలీవుడ్‌ క్రిటిక్‌ తన రివ్యూని ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. సినిమాలో ఏమేం బాగున్నాయో వివరంగా చెబుతూ.. ’హను`మాన్‌’కు 3.5 రేటింగ్‌ కూడా ఇచ్చారు. ప్రశాంత్‌ వర్మ ఒక సాలిడ్‌ ఎంటర్‌టైనర్‌ని ప్రేక్షకులకి అందించాడు. హనుమాన్‌ సినిమా చాలా బాగుంది.

ఇందులో డ్రామా, ఎమోషన్స్‌, విఎఫ్‌ఎక్స్‌, పురాణాలకు సంబంధించిన విషయాలతో ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాని మలిచాడు. గూజ్‌బంప్స్‌ తెప్పించే సీన్లు, అదిరిపోయే క్లైమాక్స్‌.. ఈ సినిమాకు ప్రధాన బలం. నేను ఈ సినిమాను ప్రేక్షకులకు రికమెండ్‌ చేస్తున్నాను.

ఆర్టిస్ట్‌ల విషయానికి వస్తే.. ఇందులో నటించిన నటీనటులందరూ అసాధారణమైన నటనను కనబరిచారు. తేజ సజ్జా తన పాత్రకు న్యాయం చేశాడు. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ తన మార్క్‌ని ప్రదర్శించింది. వినయ్‌ రాయ్‌ చాలా భయంకరంగా కనిపించాడు. సముద్రఖని తన సూపర్‌ ఫామ్‌ని కొనసాగించాడు. వెన్నెల కిశోర్‌ చాలా బాగా చేశాడు. డబ్బింగ్‌ కూడా పర్ఫెక్ట్‌గా కుదిరింది.