తెలుగు స్టేట్స్ లో డే15 ఆల్ టైం రికార్డు అందుకున్న “హనుమాన్”

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్న మన మొదటి తెలుగు సూపర్ హీరో చిత్రం “హను మాన్”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా టాలీవుడ్ లో ఓ మాసివ్ బ్రేక్ ని అందుకోగా ఈ చిత్రం సెట్ చేస్తున్న రన్ అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఎన్నో రికార్డులు సెట్ చేస్తుంది.

కాగా లేటెస్ట్ గానే ఈ చిత్రం 10 మిలియన్ ఫుట్ ఫాల్స్ తో మరో మాసివ్ రికార్డు సెట్ చేయగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అయితే మరో ఆల్ టైం రికార్డు సెట్ చేసింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 15వ రోజు అయితే ఇప్పుడు వరకు వచ్చిన ఏ తెలుగు సినిమా ఇన్ క్లూడింగ్ పాన్ ఇండియా చిత్రాలు కూడా అందుకొని భారీ షేర్ ని 15వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అందుకున్నట్టుగా తెలుస్తుంది.

మరి హనుమాన్ 15వ రోజు 3 కోట్లకి పైగా షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది. ఈ మొత్తం పలు భారీ చిత్రాలు “బాహుబలి 2”, “RRR” లాంటి సినిమాలు కూడా ఈ మాసివ్ ఫీట్ ని అందుకోలేదు. దీనితో హనుమాన్ సినిమా తెలుగు హిస్టరీ లోనే ఒక ఆల్ టైం రికార్డు అయితే సెట్ చేసింది.

దీనితో హనుమాన్ చిత్రం రికార్డుని మళ్ళీ ఏ చిత్రం బ్రేక్ చేస్తుందో దానికి ఎన్నాళ్ళు పడుతుందో చూడాలి మరి. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా అమృత అయ్యర్ నటించగా వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు నటించారు. పార్ట్ 2 లో కొందరు కొనసాగుతారు.