“హనుమాన్” హిందీ వసూళ్లు ఎలా ఉన్నాయంటే..

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర ఓ రేంజ్ లో వినిపిస్తున్న తెలుగు సినిమా పేరు “హనుమాన్”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం సాలిడ్ మౌత్ టాక్ అందుకోగా తెలుగు స్టేట్స్ లో అయితే ఈ పండుగ సీజన్ ని బాగా క్యాష్ చేసుకుంటుంది.

కాగా ఈ సినిమా హిందీలో కూడా బాగా రాణించాలని చాలా మంది కోరుకోగా అనుకున్న దానికంటే బాగానే మంచి ఓపెనింగ్స్ ని హిందీ మార్కెట్ లో ఈ చిత్రం అందుకోగా ఇప్పుడు రెండో రోజు కూడా సాలిడ్ వసూళ్ళని హను మాన్ నార్త్ బెల్ట్ లో సాధించింది.

మొదటి రోజు 2.15 కోట్ల నెట్ వసూళ్లు హిందీ మార్కెట్ లో అందుకున్న ఈ చిత్రం రెండో రోజు 88 శాతానికి పైగా జంప్ అందుకొని 4 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టింది. దీనితో ఈ రెండు రోజుల్లో 6 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుంది. దీనితో ఇక ఆదివారం కూడా హను మాన్ ని అదిరే నంబర్స్ వస్తాయని చెప్పాలి.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా లాంగ్ రన్ లో ఒక్క హిందీ వెర్షన్ లోనే 100 కోట్లు అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ గెటప్ శ్రీను తదితరులు నటించగా గౌర హరీష్ సెన్సేషనల్ మ్యూజిక్ ని ఈ సినిమాకి అందించాడు.