‘హనుమాన్‌’ ట్రైలర్‌ తేదీ వచ్చేసింది!

టాలీవుడ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్‌’. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుండగా, ఇందులో జాంబిరెడ్డి కథానాయకుడు తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు.

ఇక సూపర్‌ హీరో సిరీస్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ హాలీవుడ్‌ స్థాయి విజువల్స్‌తో అందరినీ ఇంప్రెస్‌ చేస్తోంది. యూనివర్సల్‌ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే హై టెక్నికల్‌ వాల్యూస్‌తో కట్‌ చేసిన విజువల్స్‌ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ట్రైలర్‌ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు తెగ వెయిటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్‌కు సంబంధించి మేకర్స్‌ సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. హనుమాన్‌ ట్రైలర్‌ అనౌన్స్‌మెంట్‌ను డిసెంబర్‌ 12న ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు  ప్రకటించింది.