దూసుకుపోతున్న ‘గుంటూరు కారం’

టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్ బాబు కాంపౌండ్‌ నుంచి వచ్చిన చిత్రం ‘గుంటూరు కారం’.ఈ సినిమాను తొలి రోజు నుంచి నెగెటివ్‌ టాక్‌, ట్రోల్స్‌ చుట్టుముడుతున్నా..కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటోంది. టాక్‌ మాటెలా ఉన్నా సూపర్‌ స్టార్‌ మ్యానరిజానికి అభిమానులు మరోసారి ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే థియేటర్లలో దగ్గర డ్యాన్సులు, కేకలతో హోరెత్తిస్తోన్న వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘గుంటూరు కారం’ నెగెటివ్‌ టాక్‌తో సంబంధం లేకుండా అత్యంత అరుదైన ఫీట్‌ను నమోదు చేసింది.

‘గుంటూరు కారం’ రూ.100 కోట్ల షేర్‌ రాబట్టింది. భరత్‌ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట సినిమాల తర్వాత ఈ రికార్డు సాధించిన చిత్రంగా ‘గుంటూరు కారం’ నిలిచింది. దీంతో బ్యాక్‌ టు బ్యాక్‌ ఐదు సినిమాలకు రూ.100 కోట్ల షేర్‌ సాధించిన వన్‌ అండ్‌ ఓన్లీ టాలీవుడ్‌ హీరోగా రికార్డుల్లోకెక్కాడు ప్రిన్స్‌. ‘గుంటూరు కారం’ శాటిలైట్‌ రైట్స్‌ను జెమినీ టీవీ దక్కించుకోగా.. పాపులర్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ప్లిక్స్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుంది.

‘గుంటూరు కారం’ మేకింగ్‌ వీడియో, మేకింగ్‌ స్టిల్స్‌ నెట్టింట హల్‌ చల్‌ చేస్తూ.. సినిమాపై సూపర్‌ హైప్‌ క్రియేట్‌ చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సెట్స్‌లో విూనాక్షి చౌదరి, శ్రీలీల, మహేశ్‌ బాబు, త్రివిక్రమ్‌ అండ్‌ ప్రొడ్యూసర్స్‌ టీం సరదా క్షణాలకు సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఈ మూవీలో ఎస్‌. థమన్‌ ఊరమాస్‌ కంపోజిషన్‌లో శ్రీలీల, మహేశ్‌ బాబు కాంబోలో వచ్చే హై ఓల్టేజ్‌ స్పైసీ హాట్‌ మాస్‌ కుర్చీని మడతపెట్టి సాంగ్‌ తో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.