టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఊహించని పరిణామాలు అయితే చోటుచేసుకుంటున్నాయి. మొదట కథ ఓకే చేసినప్పటి నుంచి సినిమా సెట్స్ పైకి వచ్చేవరకు కూడా ఏది ఒక టైం ప్రకారం అయితే ముందుకు సాగడం లేదు. ఎంతో అనుభవం ఉన్న త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ చేతికి ఇప్పుడు మహేష్ అస్సలు చిక్కడం లేదు.
ఒక విధంగా మహేష్ కథకు తగ్గట్టుగా కమిట్మెంట్ అయితే ఇస్తాడు కానీ కాన్ఫిడెంట్ గా లేకపోతే మాత్రం ఈ మధ్యకాలంలో అసలు సహించడం లేదు. ఏ మాత్రం డౌట్స్ వచ్చినా కూడా డైరెక్ట్ గా అడిగేస్తున్నాడు. అవసరమైతే టైం తీసుకోండి కానీ మంచి కంటెంట్ అయితే రావాలి అనేలా కండిషన్స్ పెడుతూ ఉన్నాడు. ఇక గుంటూరు కారం సినిమా విషయంలో ఇప్పటికే ఆ తరహాలో మహేష్ చాలా సార్లు కండిషన్స్ అయితే పెట్టాడు.
ఇప్పుడు విదేశాల్లో ఉన్న మహేష్ బాబు అక్కడే ఫ్యామిలీతో పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకోనున్నాడు. ఇక మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాడు అనే విషయంలో ఇంతవరకు ఒక కరెక్ట్ క్లారిటీ అయితే లేదు. ఇక పుట్టినరోజు అప్డేట్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈసారి తప్పనిసరిగా మహేష్ ను త్రివిక్రమ్ ఏదో ఒక విధంగా ఒప్పించి తీరాల్సిందే.
అసలైతే ప్లాన్ ప్రకారం పుట్టినరోజు ఒక సాంగ్ విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అది మహేష్ బాబుకు అంతగా కనెక్ట్ కాలేదు. థమన్ నుంచి ఇంకా బెస్ట్ కంటెంట్ కోరుకుంటున్నాడు మహేష్. అందుకే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం ఇక త్రివిక్రమైతే మహేష్ బాబును ఏదో ఒక విధంగా ఒప్పించి ఆ సాంగ్ విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. మరి మహేష్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.