ఇన్సైడ్ టాక్ : మహేష్ సినిమాకి ఈసారి ఎవరినీ క్షమించేదిలే.!

ప్రెజెంట్ టాలీవుడ్ దగ్గర ఉన్న పలు క్రేజీ కాంబినేషన్ లలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్నా హ్యాట్రిక్ చిత్రం “గుంటూరు కారం” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎన్నో అడ్డంకులు అలా ఈ చిత్రానికి మొదటి నుంచి కూడా వస్తుండగా.

ఇప్పుడు అయితే అన్నీ ఓ కొలిక్కి వచ్చినట్టే అనిపిస్తున్నాయి. దీనితో చిత్ర యూనిట్ ఈసారి సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాగా ఇప్పుడు అయితే ఈ చిత్రం విషయంలో పలు ఇంట్రెస్టింగ్ అంశాలు వినిపిస్తున్నాయి. ఈరోజు నుంచి సినిమా కొత్త షెడ్యూల్ అయితే స్టార్ట్ కాగా ఇక్కడ నుంచి చిత్ర యూనిట్ ఎవరినీ క్షమించే ప్రసక్తి లేదని తెలుస్తుంది.

ఈసారి నుంచి షూటింగ్ లో ఏ ఒక్క ఆర్టిస్ట్ మిస్ అయినా లేదా ఏ ఆర్టిస్ట్ డేట్స్ ప్రస్తుత రోజుల్లో సెట్ అవ్వవు అని టాక్ వచ్చినా కూడా వారిని ఏమాత్రం ఆలోచించకుండా తీసేయాలని వారి ప్లేస్ వేరే నటులతో షూటింగ్ అయినా చేసేయాలని ఫిక్స్ అయ్యారట.

అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఇదే సూత్రం సంగీత దర్శకుడు థమన్ విషయంలో కూడా అప్లై చేస్తున్నారని తెలుస్తుంది. ఇచ్చిన సమయంలో థమన్ కానీ మ్యూజిక్ వర్క్ కంప్లీట్ చేయకపోతే థమన్ ని కూడా పక్కన పెట్టేస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈసారి మాత్రం గుంటూరు కారం చిత్ర యూనిట్ చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పాలి.