“గుంటూరు కారం” ప్రొడ్యూసర్..అస్సలు తగ్గేదేలే… 

Suryadevara-Naga-Vamsi

టాలీవుడ్ సినిమా దగ్గర అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకడు. మరి మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలతో సూపర్ స్టార్ మహేష్ మళ్ళీ తన ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అయితే రాబోతున్నాడు.

మరి ఈ సెన్సేషనల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రమే “గుంటూరు కారం”. పక్కా మాస్ లెవెల్లో చేస్తున్న ఈ సినిమా స్టార్టింగ్ లో కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నెక్స్ట్ మాత్రం కంప్లీట్ మాస్ ప్యాకేజ్ గా అయితే తెరకెక్కుతుంది. దీనితో సినిమా విషయంలో మాత్రం యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ మొదటి నుంచీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

దీనితో గుంటూరు కారం సినిమా సంక్రాంతికి అదరగొట్టేస్తుంది అనేది ఫిక్స్ అయిపోగా సంక్రాంతి రేస్ లో ఉన్న భారీ పోటీపై ఈ నిర్మాత ఇచ్చిన స్టేట్మెంట్ మాస్ గా మారింది. రిలీజ్ డేట్ విషయంలో గిల్డ్ నుంచి ఏమన్నా రిక్వెస్ట్ వచ్చిందా మీరు కానీ ఎవరిని అయినా అడిగారా అంటే నేనెందుకు వెళ్తాను.. 

సంక్రాంతి లో ప్రేక్షకులు మొదటిగా చూసే ఛాయిస్ మా సినిమా సో నాకు ఎవరి దగ్గరకి వెళ్లాల్సిన అవసరం లేదు. సో ఏమన్నా ఉంటే వాళ్ళే వచ్చి నన్ను అడగాలి నేను అయితే ఎవరిని అడగను నాకు అడగాల్సిన పని లేదు అని తేల్చి  చెప్పేసాడు. దీనితో రిలీజ్ విషయంలో కానీ సంక్రాంతి పోటీ విషయంలో కానీ అసలు తగ్గేదేలే అంటున్నారని చెప్పాలి.