సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ మాత్రమే కంప్లీట్ చేసుకుంది. థర్డ్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం సిద్ధంగా లేరు. సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత మహేష్ బాబు గ్యాప్ తీసుకున్నారు.
అయితే ఎప్పటికప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్న మహేష్ బాబు మాత్రం వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. దీనికి కారణం వేసవితాపం అని తెలుస్తోంది. నిజానికి మహేష్ బాబు వేసవి సీజన్ లో ఎప్పుడు కూడా మూవీ షూటింగ్స్ పెట్టుకోడు. ఫ్యామిలీతో ఏదో ఒక దేశం సమ్మర్ వెకేషన్ కి వెళ్ళిపోతారు. వెకేషన్ నుంచి వచ్చిన ఇంటి పట్టునే ఉంటారు తప్ప బయటకి వెళ్ళరు.
ఇక సూపర్ స్టార్ కృష్ణ జయంతికి మహేష్, త్రివిక్రమ్ మూవీ టైటిల్, యాక్షన్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఇక జులై ఫస్ట్ వీక్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్చేయాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం షూటింగ్ కి ఇంకా సిద్ధంగా లేనని చెప్పేశారంట. సమ్మర్ ఎఫెక్ట్ ఇంకా తగ్గకపోవడంతో జులై లో పరిస్థితుల బట్టి షూటింగ్ లో జాయిన్ అయ్యేది లేనిది డిసైడ్ అవ్వాలని మహేష్ బాబు అనుకుంటున్నారంట.
అయితే సంక్రాంతి 12, 2024న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు లేట్ చేస్తూ ఉండటం వలన షూటింగ్ కూడా బ్యాక్ కి వెళ్ళిపోతోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి రేసులో గుంటూరు కారం ఉండే అవకాశం లేకపోవచ్చనే మాట వినిపిస్తోంది. త్రివిక్రమ్ షూటింగ్ పెర్ఫెక్ట్ గా చేసుకుంటూ వెళ్తారు.
ఎక్కడ చిన్న లూప్ కూడా ఉంచకుండా తాను పేపర్ మీద ఏదైతే రాసుకున్నారో దానినే చూపిస్తారు. ఈ నేపథ్యంలో అతని సినిమాలు అన్ని కూడా ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకుంటాయి. ఒక వేళ మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్ ఆగష్టు లో స్టార్ట్ చేస్తే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాకపోవచ్చని భావిస్తున్నారు.