వీడియో టాక్ : “గుంటూరు కారం” కుర్చీ మడతపెట్టి.. సాంగ్ ఎలా ఉందంటే

ప్రస్తుతం రాబోతున్న కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అవైటెడ్ చిత్రాల్లో టాలీవుడ్ ఎవర్ చార్మ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో చేస్తున్న హ్యాట్రిక్ సినిమా “గుంటూరు కారం” కూడా ఒకటి. కాగా వీరి నుంచి వస్తున్నా హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో హైప్ కూడా మంచి పీక్స్ లోకి వెళ్తుంది.

అయితే దీనిని బిల్డ్ చేసే క్రమంలో మేకర్స్ మాస్ గా గట్టి ప్లానింగ్ లనే చేస్తున్నారు. కాగా అలా ఓ సూపర్ మాస్ అండ్ ఊహించని సాంగ్ ని అయితే మేకర్స్ నిన్న ప్రోమోతో అనౌన్స్ చేసి అందరికీ ఒకసారిగా షాక్ ఇచ్చారు. కుర్చీ మడత పెట్టి అంటూ రిలీజ్ చేసిన ప్రోమో క్రేజీ హిట్ అయ్యింది.

ఇక దీనితో ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందా అని అంతా ఎదురు చూడగా ఎట్టకేలకి ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు. కాగా ఈ ఫుల్ మాత్రం డెఫినెట్ గా అంచనాలు అందుకునే లెవెల్లో ఉందని చెప్పవచ్చు. గత సాంగ్స్ తో పోలిస్తే ఇది బెటర్ గా కాస్త రెఫ్రెషింగ్ గానే ఉంది. కానీ ఆ కుర్చీ మడత పెట్టి లిరిక్స్ మాత్రం మిగతా సాంగ్ మూమెంట్ కి సింక్ కాలేదు అనిపిస్తుంది.

కానీ టోటల్ సాంగ్ మాత్రం బానే అనిపిస్తుంది. ఇక సాంగ్ లో మహేష్ బాబు శ్రీ లీల ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఇద్దరితో శేఖర్ మాస్టర్ వేయించిన స్టెప్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే థమన్ మాత్రం ఈ సాంగ్ కి బాగానే వర్క్ అందించాడు. ఇక ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. కాగా ఈ సినిమా ఈ జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
Kurchi Madathapetti Lyrical Video |Guntur Kaaram |Mahesh Babu| Sreeleela |Trivikram | Thaman S