ఈ ఏడాదిలో తెలుగు సినిమా నుంచి టైర్ హీరోస్ లో వచ్చిన మొదటి సినిమానే “గుంటూరు కారం”. మరి భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమా కాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఇది మూడో సినిమా. ఇందులో హ్యాట్రిక్ కాంబో అని చెప్పి గట్టిగానే హైప్ నమోదు అయ్యింది.
కాగా ఈ చిత్రం విడుదల అయ్యాక అనుకున్న రేంజ్ అంచనాలు అందుకోలేదు అనేది ఉన్న మాట. కానీ రిలీజ్ కి ముందు వరకు కూడా హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. తెలుగు స్టేట్స్ లో అయితే బెన్ఫిట్ షో టికెట్ లు సుమారు 5 వేలు వరకు కూడా వెళ్లాయి. దీనితో రీజనల్ గా గుంటూరు కారం భారీ ఓపెనింగ్స్ అందుకుంటుంది అనే చాలా మంది నమ్మారు.
కాగా ఇప్పుడు అనుకున్నట్టుగానే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఏకంగా 94 కోట్ల గ్రాస్ ని వసూలు చేస్తినట్టుగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కాగా ఇది నిజమైన నెంబర్ అవునా కాదా అనేది పక్కన పెడితే వారే అఫీషియల్ గా పెట్టారు కాబట్టి ఇందులో ఎలాంటి డౌట్ పెట్టుకోనక్కర్లేదు.
ఇక మన తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వివరాలు చూసినట్టు అయితే ఈ సినిమా మొదటి రోజే ఏకంగా 40 కోట్ల మేర షేర్ ని టచ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇది కూడా రీజనల్ సినిమాల్లో అయితే ఆల్ టైం రికార్డు అన్నట్టు తెలుస్తుంది. ఇందులో సుమారు 17 కోట్ల మేర షేర్ ని తెలంగాణ నుంచి రాబట్టగా మిగతా మొత్తం ఏపీ నుంచే అందుకుంది. దీనితో గుంటూరు కారం ఒక బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుంది అని చెప్పాలి. ఇక ఈ వీకెండ్ లో అయితే వసూళ్లు ఎలా ఉంటాయి అనేది వేచి చూడాలి.